బ్లాఫ్ మాస్టర్ తో పోటీకి వస్తున్న ఇదమ్ జగత్

పాపం మొన్నటివరకూ సోలో రిలీజ్ అనుకుని సంతోషపడుతున్న సత్యదేవ్ మీదకు ఒక్కసారిగా మూడు సినిమాలు వచ్చాయి. నిజానికి సత్యదేవ్ “బ్లాఫ్ మాస్టర్” సినిమాను డిసెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు అతడికి ఎవరూ పోటీ లేరు అనుకున్నారు. కానీ.. ఉన్నట్లుండి సుమంత్ “ఇదమ్ జగత్” డిసెంబర్ 28న విడుదల తేదీ ప్రకటించబడింది, ఆ సినిమాతోపాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా అదే తేదీన విడుదలకు సిద్ధమయ్యాయి. దాంతో నిన్నటివరకు ఫుల్ హ్యాపీగా ఉన్న సత్యదేవ్ కాస్త టెన్షన్ పడడం మొదలెట్టాడు.

మిగతా చిన్న సినిమాలను పక్కనపెడితే.. ఇదమ్ జగత్ మాత్రం బ్లాఫ్ మాస్టర్ కు గట్టి పోటీ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ రెండు సినిమాలు ఇంచుమించుగా ఒకే జోనర్ కి చెందినవి. రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ & క్యారెక్టరైజేషన్స్ చాలా చోట్ల మ్యాచ్ అవుతాయి. సో, ఈ రెండు సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అనేది పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాలని మాత్రం అందరూ అనుకొంటున్నారు. అందుకు కారణం చిత్ర కథానాయకులే. సత్యదేవ్ గత కొన్నాళ్లుగా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. సుమంత్ ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్నాడు. కావున ఈ ఇద్దరు హీరోలు ఇయర్ ఎండింగ్ లో సూపర్ హిట్స్ అందుకోవాలని కోరుకొందాం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus