Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ ఈవెంట్ లో సత్యదేవ్ భార్య దీపికా.. వైరల్ అవుతున్న వీడియో!

సత్యదేవ్,తమన్నా, కావ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’.ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగ శేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచమవుతున్నాడు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. అనేక సార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 9న విడుదల కానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నిన్న హైదారాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అడవి శేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇదిలా ఉండగా.. ఈ వేడుకకు సత్యదేవ్ ఫ్యామిలీ కూడా హాజరైంది.

ఈ క్రమంలో తమన్నా.. ” ఈ మూవీలో చేసిన ముగ్గురు హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు. అలాగే మీ రియల్ లైఫ్ హీరోయిన్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెను కూడా స్టేజి పైకి పిలిచి పరిచయం చేస్తే బాగుంటుంది. ఆమె గురించి మాకు తెలుసు. ఆమెకు మీకు కేవలం స్టైలింగ్ మాత్రమే చేయడం లేదు. మీకు ప్రధాన బలం అని కూడా మాకు తెలుసు. కాబట్టి ఆమెను పరిచయం చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది” అని తమన్నా సత్యదేవ్ తో అంటుంది. ఈ క్రమంలో తన భార్య దీపికను స్టేజి పైకి పిలుస్తాడు సత్యదేవ్.

ఆమె తన బాబుతో కలిసి స్టేజి పైకి వస్తుంది” అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సత్యదేవ్ గతంలో జూనియర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించేవాడన్న సంగతి తెలిసిందే. ఓ పక్క సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా చేస్తూనే.. మరోపక్క సినిమాల్లో కూడా నటించేవాడు. నెలకు రూ.1.5 లక్షలు సంపాదించే సత్యదేవ్.. సడెన్ గా ఆ ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి నటుడిగా మారాడు. అందుకు తన భార్యే కారణమని ఓ సందర్భంలో సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ‘నేను ఏం చేసినా 100 శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాను అని తనకి తెలుసు.

అందుకే నేను రెండు రకాలుగా కష్టపడటం ఇష్టం లేక.. జాబ్ మానేయమని సూచించింది. కచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అని తను బలంగా నమ్మింది. ‘వీడిని ఎడారిలో వదిలేసినా ఏదో ఒక రకంగా బ్రతికేస్తాడు’ అనేది తన ఫిలాసఫీ. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు.. మా అమ్మ నాన్నలను కన్విన్స్ చేసి.. చాలా సపోర్ట్ ఇచ్చింది నా భార్య.! నిజంగా ఆమె నా భార్యగా దొరకడం నా అదృష్టం. నేను ఆమెకు బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి” అంటూ సత్యదేవ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus