Rajinikanth: రజనీకాంత్ పేరుతో అక్కడ భారీ స్కాం.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం తెలుగులో వేటగాడు తమిళంలో వెట్టయాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  డైరెక్షన్ లో ఒక సినిమాలో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్2 (Jailer2) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా రజనీకాంత్ పేరుతో మోసం జరగడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బెంగళూరులో రజనీకాంత్ పేరుతో భారీ మోసం జరిగింది.

రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబో సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించనుండగా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలంటూ బెంగళూరులో ఒక అడిషన్స్ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ అనేసరికి చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నారు. ఈ అడిషన్ కు వెళ్లిన వాళ్లకు కొంతమంది క్యాస్టింగ్ డైరెక్టర్స్ అని పరిచయం చేసుకున్నారు.

రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కల్పిస్తామని చెప్పి అడిషన్స్ కు వచ్చిన వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేశారు. సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఈ అడిషన్స్ ను నిర్వహించారని తెలుస్తోంది. అలా ఆ వ్యక్తుల చేతిలో మోసపోయిన వ్యక్తులలో మృదుల ఒకరు కాగా రజనీ సినిమాలో ఛాన్స్ కోసం ఆమె 3.9 లక్షల రూపాయలు చెల్లించారు. మృదుల బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్ లో మృదులతో పాటు మరెవరైనా మోసపోయారా? అనే ప్రశ్నకు సమాధానాలు తెలియాల్సి ఉంది. సినిమా అడిషన్స్ పేరుతో వచ్చే ప్రకటనల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడిషన్స్ కు హాజరయ్యే వాళ్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. రజనీ పేరుతో మోసం జరిగిందని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus