ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ తనకిష్టమైన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కొన్నేళ్ల క్రితం రాఘవేంద్ర రావు కుమారుడు, దర్శకుడు ప్రకాష్ కోవెలమూడిని ఐదేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది కనికా. బాలీవుడ్ లో రచయితగా పని చేస్తోన్న సమయంలోనే ప్రకాష్ ని పెళ్లాడింది. కానీ వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
వ్యక్తిగతంలో ఎన్ని సమస్యలు ఉన్నా.. ప్రొఫెషనల్ గా మాత్రం ఇద్దరూ కలిసి పని చేశారు. ఇదిలా ఉండగా.. కనికా బాలీవుడ్ రచయిత హిమాన్షు శర్మతో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. అతడిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అనౌన్స్ చేసింది. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనికా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.
”కొత్త సంవత్సరంలో కొత్త ప్రయాణం” అని క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేశారు కనికా. ఇద్దరూ రచయితలు కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వీరిద్దరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. కరోనా కాలం కాబట్టి ఈ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!