NBK107: మలయాళీ ముద్దుగుమ్మకు బాలయ్య ఛాన్స్ ఇచ్చారా?

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తాను గమ్మత్తైన రోల్ లో నటిస్తున్నానని శృతిహాసన్ ఇప్పటికే కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ను ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం అందుతోంది.

హనీ రోజ్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హనీ రోజ్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆమె నటించారు. తెలుగులో ఈ వర్షం సాక్షిగా, ఆలయం సినిమాలలో హనీ రోజ్ నటించగా ఈ సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చాలామంది సినీ ప్రేక్షకులకు తెలియదు.

అయితే బాలయ్య సినిమాలో నటించడం ద్వారా హనీ రోజ్ కు సినిమా ఆఫర్లు కచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. క్రాక్ సక్సెస్ తో జోరుమీదున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో ఆ సినిమాను మించిన హిట్ సాధించాలని భావిస్తున్నారు. బాలయ్య ఈ సినిమాకు కేవలం 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో దునియా విజయ్ నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus