నాగశౌర్య మూవీ “ఛలో” టైటిల్ స్టోరీ ఇదే!

యువ హీరో నాగశౌర్య తాజా సినిమా “ఛలో” కోసం యువత ఎదురుచూస్తోంది. మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద శిష్యుడిగా పనిచేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగశౌర్య అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. తన చిత్రం టైటిల్ నుంచే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిందని వెల్లడించారు. అంతగా ఆకర్షించిన టైటిల్ వెనుక ఓ స్టోరీ ఉందన్నారు. “నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉన్న ఈ సినిమాకు ఓ క్యాచీ టైటిల్ పెట్టాలని అనుకున్నాను. ఓ రోజు కారులో వెళ్తూ రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ సినిమాలోని ‘లే ఛలో’ పాట వింటుండగా ఓ ఆలోచన వచ్చింది.

నా సినిమాకు ‘ఛలో’ అనే టైటిల్ అయితే బాగుంటుందని భావించి దర్శకుడు వెంకీ కుడుములకు, అమ్మానాన్నలకు చెప్పా. వాళ్లకు కూడా నచ్చేయడంతో వెంటనే ఓకె చెప్పేశారు. అలా నా సినిమా పేరులో కూడా రామ్‌చరణ్ పాత్ర ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది” అని అసలు సంగతి చెప్పారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వచ్చి చిత్ర బృందాన్ని అభినందించిన సంగతి తెలిసిందే. మహతి సర్వ సాగర్ “చలో” కోసం అందించిన పాటలు ఇప్పుడు అందరి ఫేవెరెట్ సాంగ్స్ అయ్యాయి. కన్నడ బ్యూటీ రష్మిక ఈ చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు   పెట్టబోతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిన ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus