బాహుబలి సక్సెస్ వెనుక సిల్లి సెంటిమెంట్స్!

బాహుబలి…ఈ ఒక్క పేరు దాదాపుగా అయిదేళ్ళ పాటు యావత్ సినీ ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించింది. అయితే అలాంటి బాహుబలి సూపర్ డూపర్ హిట్ కావడానికి ఎంతో మంది కృషి, దర్శకత్వ ప్రతిభ, అదే క్రమంలో కధపై, కధనంపై నిర్మాతల నమ్మకం అంటే నమ్మక తప్పని నిజం. అయితే అదే క్రమంలో వీటన్నింటితో పాటు బాహుబలి సినిమా సూపర్ హిట్ కావడానికి మరో కారణం కూడా ఉందట…అదేంటి , ఆ కధ ఏంటి అని మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకసారి ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది. అసలు విషయంలోకి వెళితే….ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కలలో కూడ ఊహించుకోని చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ‘బాహుబలి’ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఒక జ్యోతిష్య కారణం ఉందట….అయితే ఆ కారణాన్ని ఎవరో పుల్లారావో, లేక సుబ్బారావో చెబితే కొట్టి పాడేయ్యవచ్చు కానీ….సాక్షాత్తూ నిర్మాత కరణ్ జోహార్, ప్రముఖ న్యూమరాలజిస్ట్ సంజయ్ జుమానినే చెబితే ఒప్పుకోక తప్పని నిజం.

అయితే అసలు వాళ్ళు చెప్పిన ఆ నిజం ఏంటి అంటే…ఒకసారి మీరే చదవండి..‘బాహుబలి’ సినిమా పోస్టర్ లో AA ఉంటే ఆసినిమా సక్సస్ అయ్యే అవకాశం లేదని అందువల్లనే ఆ సినిమా పోస్టర్ నుండి ఒక A ను తొలగించిన విషయాన్ని సంజయ్ జుమాని బయట పెట్టాడు. అంతేకాదు ‘బాహుబలి’ రెండో భాగం పోస్టర్ లో 2 అంకెను యాడ్ చేసామని అయితే సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం Baahubali The Conclusion అని ఉంది అన్న విషయాన్ని తెలిపాడు. ఇక ఈ దెబ్బతో దీనితో ‘బాహుబలి’ పోస్టర్స్ పై  ఉండాల్సిన Baahubali నుండి ఒక A ఎగరగొట్టి Bahubali అని పేరు పెట్టడం వెనుక మూఢనమ్మకం ఉందన్న విషయం బయట పడింది. మొత్తంగా చూసుకుంటే బాహుబలి సక్సెస్ వెనుకాల ఇంత మ్యాటర్ ఉందన్న మాట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus