Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ‘సీతా కళ్యాణ వైభోగమే’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

‘సీతా కళ్యాణ వైభోగమే’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

  • April 15, 2024 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సీతా కళ్యాణ వైభోగమే’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు.

సుమన్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీగా కాదు. మా మీద నమ్మకంతో చిత్రాన్ని తీసిన నిర్మాత రాచాల యుగంధర్ గారికి థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ గారు అన్ని అంశాలను కలగలపి మంచి కమర్షియల్ సినిమాను తీశారు. గగన్ విహారి గారు చాలా వైల్డ్‌గా నటించారు. సంగీతం, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. మా ఫ్యాషన్ పార్ట్నర్స్ అయిన నీరుస్‌కు థాంక్స్. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరారు.

గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు.

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఊరికి ఉత్తరాన. ఆ చిత్రానికి కూడా యుగంధర్ గారు సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలానే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది. చాలా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు’అని అన్నారు.

నిర్మాత రాచాల యుగంధర్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు సతీష్ గారు ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో యాక్షన్, లవ్, కుటుంబ విలువలు అన్నీ కలగలపి తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. సుమన్ తేజ్, గరిమ చౌహాన్ కొత్త వాళ్లైనా అద్భుతంగా నటించారు. ధర్మపురి హీరో గగన్ విహారి ఈ సినిమాలో విలన్‌గా చక్కగా నటించారు. వందల మందితో పాటలు, ఫైట్లను భారీ ఎత్తున తీశాం. నీరుస్ యాజమాన్యం మాతో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. మీడియా మాకు ముందు నుంచీ సహకారం అందిస్తోంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

గగన్ విహారి మాట్లాడుతూ.. ‘ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది. దర్శకుడు సతీష్ గారు సీతా కళ్యాణ వైభోగమే కథ చెప్పారు. టైటిల్ వింటేనే ఎంతో హాయిగా అనిపించింది. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తాను. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

ఈసినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి. వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #seethaa kalyana vaibhogame
  • #Tollywood

Also Read

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

related news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

trending news

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

20 mins ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

40 mins ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

44 mins ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

1 hour ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

2 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

4 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

7 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

1 day ago
Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

1 day ago
Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version