Brahmamudi August 23rd: అపర్ణకు చివాట్లు పెట్టిన సీతారామయ్య దంపతులు.. ట్విస్ట్ ఇచ్చిన రాజ్!

బుల్లి తెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటూ మంచి ఆదరణ పొందిన బ్రాహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో బాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తె… కావ్య అపర్ణ గదికి వెళ్ళగా అపర్ణ అక్కడే ఆగు నా గదిలోకి రావడానికి వీలు లేదు అంటూ మాట్లాడుతుంది. పిల్లలు తప్పు చేస్తే పెద్దవారు క్షమించాలి .నన్ను క్షమించండి అత్తయ్య అంటూ కావ్య అపర్ణకు క్షమాపణలు చెబుతుంది. నా కుటుంబ సభ్యులను అయితే క్షమించే దాన్ని. నువ్వు ఎప్పటికి ఈ కుటుంబలో భాగంగా కాలేవు.

గాలి వానకు కొట్టుకు వచ్చిన గడ్డిపోచవి అంటూ మాట్లాడుతుంది.అపర్ణ అలా మాట్లాడే సరికి కావ్య తన గదికి వెళ్తుంది. తన గదిలో రాజ్ చేతికి ఉన్న కట్టు విప్పుతూ ఉండగా అలా ఎందుకు చేస్తున్నారని కావ్య అడుగుతుంది. అయినా రాజ్ తనని పట్టించుకోడు. నేను మా నాన్నకు మాట ఇచ్చాను పుట్టింటికి వెళ్తాను అని కావ్య అడిగిన రాజ్ మాట్లాడకుండా ఆఫీస్ కి బయలు దేరుతారు. చేసేదేమీ లేక కావ్య కృష్ణుడు విగ్రహం వద్దకు వెళ్లి తన బాధను చెప్పుకొని బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది.

హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. తాతయ్య నేను పుట్టింటికి వెళ్తాను నాన్నకు అడ్వాన్స్ ఇచ్చారు తప్పకుండా పని పూర్తి చేయాలి అని చెబుతుంది. దాంతో సీతా రామయ్య మాట్లాడుతూ ఇంట్లో నా పెద్దరికానికి విలువలేదు. నీ అత్తగారు నీకు విలువ ఇవ్వడం లేదు నా కోడలు నాకు విలువ ఇవ్వడం లేదు అంటాడు సీతారామయ్య. అదేమిటి మావయ్య గారు అలా అంటారు అంటుంది అపర్ణ. చిట్టి మాట్లాడుతూ ఆయన అన్న దాంట్లో తప్పేమీ ఉంది .మేమిద్దరం లేకపోతే ఈ కుటుంబమే లేదు.

నేను ఈ ఇంటికి ముందుకొడలుగా వచ్చాను. అలాంటిది మా మాటకు విలువ ఇవ్వకుండా ఇంటి కొడలును అర్థ రాత్రి బయట నిలబెట్టావు అంటూ చిట్టి అపర్ణకు క్లాస్ తీసుకుంటుంది. అందరూ నన్నే తప్పు పడుతున్నారు. తనను బయట నిలబెట్టింది రాజ్ అని అనడంతో రాజ్ ఎవరు నీ కొడుకు. వాడు అలా చేస్తుంటే నీకు ఆపవలసిన వివేకం, విచక్షణ నీకు లేవా అని అడుగుతుంది చిట్టి. అంత పెద్ద గొడవ జరిగితే మరి ఈ అమ్మాయి తిరగతోడడం అవసరమా అంటూ మాట్లాడుతుంది.

మా పెద్దలు ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారు. అలాంటి కుటుంబంలోని కోడలికి స్వేచ్ఛ, స్వతంత్రం లేదంటే నలుగురు ఏమనుకుంటారు అంటూ కావ్యకి ధైర్యం చెప్పి పుట్టింటికి పంపిస్తాడు సీతారామయ్య. కావ్య వెళ్ళగా అందరూ షాక్ అవుతారు. మరో వైపు రాజ్ కి జ్యువెలరీ కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది డిజైన్స్ అన్ని బాగున్నాయి కానీ త్రీ డిజైన్స్ కరెక్షన్ చేయాలి.

డీటెయిల్స్ మైల్ చేసాము. మీ డిజైనర్ కి డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయమని చెప్పండి అంటూ మాట్లాడుతారు. తరువాయి భాగంలో పుట్టింటికి వెళ్లోద్దు అంటే ఆ అమ్మాయి నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది. ఈ ఇంట్లో ఎవరూ తనతో మాట్లాడటానికి వీలు లేదని అపర్ణ ఆర్డర్ వేస్తుంది అంతలోనే కావ్య రాజ్ ఇద్దరు ఒకే కారులో దిగడం చూసి అందరు షాక్ అవుతారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus