Brahmamudi August 17th: కావ్య పై చెయ్యి చేసుకోబోయిన రాజ్!

కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేడు మరింత ఆసక్తికరంగా మారింది ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… కావ్య రాజ్ ఇద్దరు కూడా కారులో వారి పుట్టింటికి వెళ్తారు.మరోవైపు కృష్ణమూర్తి తన ఇంటిని అమ్మకానికి పెట్టడానికి బయలుదేరుతాడు మన కష్టాలను చూసి ఏ దేవుడు కూడా మనకు సహాయం చేయడం లేదు అంటూ కనకం బాధపడుతుంది. అంతలోపే రాజ్ కావ్య ఇద్దరు కారులో రావడం చూసి షాక్ అవుతారు.

మరోవైపు కావ్య కారు వెనుక సీట్ నుంచి బ్యాగ్ తీసుకోవడంతో తన కూతురిని అత్తగారింటి నుంచి పంపించేశారని బాధపడతారు. మరోవైపు కావ్య ఇక్కడికి వచ్చారు లోపలికి వచ్చి నాన్నను పలకరించి వెళ్ళండి అని చెప్పగా నాకు ఆఫీస్ కి టైమ్ అవుతుందని చెప్పి రాజ్ బయలుదేరుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి కృష్ణమూర్తి దంపతులు ఇది అసలేం భావ్యం కాదు బాబు అని కృష్ణమూర్తి అనడంతో కారు దిగివచ్చిన రాజ్ మధ్యలో నేనేం చేశాను అని అడుగుతారు. అయితే కొంత సేపు కృష్ణమూర్తి దంపతులు మాట్లాడటంతో కావ్య ఆయన నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోవడానికి రాలేదు.

ఇక్కడ బొమ్మలు చేయడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో తనని డ్రాప్ చేసి వెళ్లడానికి వచ్చారని చెప్పగా కృష్ణమూర్తి దంపతులు సంతోషపడతారు.లోపలికి రా బాబు అని పిలవగా నాకు టైం అవుతుంది వెళ్ళాలి అనడంతో కావ్య ఫోన్ చూపిస్తూ తనని బ్లాక్మెయిల్ చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో లోపలికి వెళ్తాడు. మరోవైపు సీతారామయ్య దగ్గరకు అపర్ణ వచ్చి మీరు చేస్తున్నది ఏం బాలేదు మామయ్య అనడంతో కావ్య విషయంలో నువ్వు అనుకుంటున్నది తప్పు తనకు ఉన్నది పొగరు కాదు ఆత్మాభిమానం.

ఇంట్లో జరిగిన గొడవ కారణంగా వారిద్దరి మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందోనని రాజ్ ను డ్రాప్ చేయమని చెప్పాను. అలా అయినవారు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తారని పంపించాను అని సీతారామయ్య చెబుతారు. కోడల్ని కూతురులా చూసుకోవాలి కానీ కనీసం నువ్వు కోడలుగా కూడా తనని అర్థం చేసుకోలేదు అంటూ సీతారామయ్య అపర్ణ ప్రవర్తన పట్ల కాస్త కోప్పడతారు. అపర్ణ రాజ్ గురించి ఆలోచిస్తూ ఉండగా రుద్రాణి అక్కడికి వెళ్లి కావ్య కుటుంబం గురించి లేనిపోని మాటలు చెబుతూ తనని రెచ్చగొడుతుంది.ఇంటికి వచ్చిన అల్లుడి కోసం కనకం ఉప్మా చేసి పెడుతుంది.

తినమని చెప్పగా తనకు ఆకలిగా లేదంటూ కావ్యకు తినిపిస్తుంటాడు అయితే అదంతా ప్రేమ అని మురిసిపోతూ కనకం దంపతులు అక్కడ నుంచి వెళ్తారు అంతలోపు కాంట్రాక్టర్ రావడంతో ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తున్నానని చెప్పగా మాకు అవసరం లేదు మీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చి తర్వాత రద్దు చేసుకుంటే మా పరిస్థితి ఏంటి అని కావ్య కోప్పడుతుంది మీరు ఈ కాంట్రాక్టు మాకే ఇవ్వాలి అంటే అగ్రిమెంట్ పై సంతకం పెట్టండి అంటూ కావ్య అడుగుతుంది తప్పనిసరి పరిస్థితులలో శ్రీను అగ్రిమెంట్ పై సంతకం పెడతాడు. అదేవిధంగా ఈ అగ్రిమెంట్ కి రాజ్ సాక్షి సంతకంగా పెడతారు.

ఆ తర్వాత ఉప్మా తినమని కావ్య రాజ్ ను బ్రతిమలాడడంతో తాను తిననని బయటకు వస్తాడు అయితే ముందర వినాయకుడి బొమ్మలు చేయడానికి కలిపి ఉన్న మట్టిని తొక్కుతాడు. ఎలాగో తొక్కారని కావ్య కూడా తనని పట్టుకొని ఆ మట్టిని తొక్కుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ పూర్తి కాగా తరువాతి ఎపిసోడ్లు ఇంటికి వచ్చిన కావ్య పై అపర్ణ ఫైర్ అవుతుంది నా కొడుకును మీలో కలిపేసుకోవాలని ఆలోచిస్తున్నారు అంటూ తిట్టడంతో మేమిద్దరం ఎక్కడ కలిసి పోతామని మీకు భయం అసలు మీరు ఆయనకు కన్నతల్లేనా అంటూ కావ్య ర్యాష్ గా మాట్లాడటంతో కోప్పడిన రాజ్ కావ్య పై చేయి ఎత్తుతారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus