‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’

టాలీవుడ్ హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని విడుదల చేశారు. కేవలం స్పోర్ట్స్ డ్రామా అన్నట్లుగా కాకుండా అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ సినిమా మాదిరిగా తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. భారీ యాక్షన్ సీన్స్, పక్కా కమర్షియల్ కథతో సినిమాను రూపొందించారు.

టీజర్ లో గోపీచంద్ చెప్పిన కొన్ని డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అనే పంచ్ డైలాగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ మొత్తాన్ని టీజర్ లో చూపించారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆంధ్ర మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల క‌బ‌డ్డీ జట్టు కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టించారు.

పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దిగంగ‌న సూర్యవంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా ముఖ్య పాత్రలు పోషించారు.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus