శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మొదట చిన్న బడ్జెట్ లోనే అందమైన కథలతోనే సినిమాలు తీసి తన ప్రత్యేకతను నిరూపించుకున్న దర్శకుడు. ‘ఫిదా’ (Fidaa), ‘హ్యాపీ డేస్’ (Happy Days) వంటి సినిమాలు ఆయనను కమర్షియల్ హిట్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి, భారీ బడ్జెట్‌తో ‘కుబేర’ (Kubera) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ధనుష్ (Dhanush) , నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna) లాంటి స్టార్ క్యాస్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా మొదట రూ.90 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసినా, చిత్ర నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆ బడ్జెట్ అనూహ్యంగా రూ.120 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
శేఖర్ కమ్ముల గత చిత్రాల కంటే ఈ సినిమాకు సాంకేతికత, సెట్ వర్క్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రాధాన్యం కావడంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే, ఈ భారీ బడ్జెట్‌పై నిర్మాతలు నమ్మకంగా ఉన్నారట. ఇందులో నటిస్తున్న స్టార్ల క్రేజ్ వలనే మంచి హైప్ ఏర్పడింది. ధనుష్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఆయన నటించడమే ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద ప్లస్.
అలాగే, నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మధ్య ప్రత్యేక స్థానం ఉంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందుతూ దక్షిణాది ఆడియన్స్‌కు చేరువైపోతున్నారు. ఈ కాంబినేషన్‌తో పాటు శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన కథన శైలిపై ప్రేక్షకుల విశ్వాసం ఉండటంతో ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా సగానికి పైగా బడ్జెట్ రికవరీ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.
ఈ సేఫ్ జోన్‌లో ‘కుబేర’ బాక్సాఫీస్ రన్ కోసం పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇక సినిమా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్, శేఖర్ కమ్ముల పనితీరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి సినిమా విడుదల అనంతరం ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.