అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి ఊపందుకుంది. నాగ చైతన్య (Naga Chaitanya)(Akhil Akkineni), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఫ్యామిలీ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోంది. నాగ చైతన్య పెళ్లి సందర్భంగా, నాగార్జున (Nagarjuna) తన కోడలు శోభితకు ఖరీదైన కానుకలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, నాగార్జున లగ్జరీ లెక్సస్ LM కారు కొనుగోలు చేసి, దాన్ని చైతన్య శోభిత దంపతులకు కానుకగా అందించారు. ఈ కార్ విలువ రూ. 2.5 కోట్లుగా ఉంది. ఇది కాకుండా, శోభిత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆభరణాల సెట్‌ను కూడా నాగార్జున సమకూర్చినట్లు సమాచారం. ఇక అఖిల్ (Akhil Akkineni) పెళ్లి విషయానికి వస్తే, అది కూడా త్వరలోనే జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అఖిల్, జైనాబ్ రావ్ జీ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు నాగార్జున ఇప్పటికే ప్రారంభించారని తెలిసింది. ఈ రెండు పెళ్లిళ్లను అక్కినేని కుటుంబం భవిష్యత్తుకు గుర్తుగా, హిందూ సంప్రదాయాలతో పాటు ఆభరణంగా మార్చాలని భావిస్తోంది. ఇక నాగ చైతన్య నటిస్తున్న తండేల్ (Thandel) త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వలన ఫిబ్రవరికి షిఫ్ట్ చేశారు. ఇక మరోవైపు నాగచైతన్య కొత్త ప్రాజెక్టులను కూడా జెట్ స్పీడ్ లోనే స్టార్ట్ చేయనున్నాడు. కార్తిక్ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.