చదువుకు వయసు అడ్డు ఎంతమాత్రం కాదు. చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ అందుకోసం ఎంత కష్టాన్ని అయినా వెనుకాడని వారు కొందరుంటారు. చదువు మీద వారికున్న ఆసక్తిని తీర్చుకోవటానికి వయసు మీద పడిన తర్వాత కూడా కొందరు విద్యాభ్యాసం చేస్తుంటారు. అయితే.. తాజాగా మలయాళం 65 ఏళ్ల వయస్సులో చదువుకోవాలనే కొరిక పుట్టిందంట.. మరి ఆ నటుడు ఎవరో తెలుసుందాం. అయితే చిన్నతనం లో ఇతనికి ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువు నాల్గవ తరగతి కి మానేయాల్సి వచ్చిందట.
కనీసం పదవ తరగతి వరకు అయినా చదువుకోవాలనే కోరిక ఇంద్రన్స్ లో అలాగే ఉండిపోయింది అట. ఈ కోరికని మనసులో దాచుకుకొని కుమిలిపోయే బదులు, ఇప్పుడు చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాయొచ్చు కదా అని అనుకున్నాడట. అందుకే ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా స్కూల్ కి వెళ్లి 10 వ తరగతి పాఠాలను వింటున్నాడట. నటుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా చదువుకోలేదు అనే బాధ నాలో అంధత్వాన్ని నింపింది.
అందుకే పదవ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు (Indrans) ఇంద్రన్స్. ఇప్పుడు తానూ ఒక్క కోత ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నానని, అందుకే పదవ తరగతి పరీక్షలు రాసి ఉతీర్ణం సాధించాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు ఇంద్రన్స్. ఈయన మలయాళం లో దాదాపుగా 400 సినిమాలకు పైగా నటించి అశేష ప్రేక్షకాభిమానం పొందిన వాడట.
వెండితెర మీద కనిపించక ముందు ఈయన 1981 వ సంవత్సరం లో టైలరింగ్ షాప్ లో పని చేస్తూ, సినిమాల్లోని నిర్మాణ సంస్థలకు కావాల్సిన కాస్ట్యూమ్స్ ని కుడుతూ జీవనం సాగించేవాడట. 1994 వ సంవత్సరం నుండి నటుడి గా మారి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు ఇంద్రన్స్.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!