పవన్ కళ్యాణ్ నిర్మాత జి.వి.జి.రాజు ఇంట్లో విషాదం..!

  • December 20, 2022 / 06:24 PM IST

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పటి నటుడు హరనాథ్ కూతురు అలాగే నిర్మాత జి.వి.జి.రాజు భార్య అయిన పద్మజా రాజు మంగళవారం నాడు మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆమె వయసు 54 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మజా అన్న అయిన శ్రీనివాసరాజు కూడా నిర్మాత అన్న సంగతి తెలిసిందే. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’ వంటి చిత్రాలు నిర్మించారు.

సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదావరి’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత. ఆ చిత్రాలకు పద్మజా రాజు సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ మధ్యనే పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాల నటుడు’ పేరుతో ఓ పుస్తకాన్ని రూపొందించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ బ్రతికున్నపుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో ఆమె ఓ న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు.

‘త్వరలోనే నా కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారు. 2023 లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఇంతలోనే ఆమె మరణించడం అనేది విషాదకరం. ఆమె ఆత్మకు ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇక పద్మజా రాజు తండ్రి హరనాథ్.. గారి గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పుడు శ్రీకృష్ణ పాండవీయం, గుండమ్మ కథ వంటి గొప్ప గొప్ప సినిమాల్లో నటించారు ఆయన. అయితే ఆయన కూడా 53 ఏళ్ల వయసుకే మరణించడం గమనార్హం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus