Nedumudi Venu: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నెడుముడి వేణు మృతి..!

ఈ మధ్యన సినీ పరిశ్రమలో ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉంది.మన టాలీవుడ్లో వరుసగా యంగ్ హీరోలు హాస్పిటల్ పాలయ్యారు. త్వరగానే కోలుకున్నారు లెండి. అయితే తాజాగా ఓ నేషనల్ అవార్డు విన్నర్ మరణించడం కలకలం సృష్టించింది. ఆయన మలయాళ నటుడు తెలుగు నటుడు కాదు.మలయాళంలో స్టార్ యాక్టర్ గా పేరొందిన నెడుముడి వేణు ఈరోజు మరణించారు. ఈయన వయసు 73 సంవత్సరాలు కావడం విశేషం. కొద్దిరోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ కు సంబంధించి చికిత్స తీసుకుంటూ వస్తున్న వేణు…

పరిస్థితి విషమించడంతో ఈ సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఓ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ను ప్రారంభించిన వేణు…. 1978లో జి.అరవిందన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘థంబు’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. మలయాళంతో పాటు తమిళంలో కూడా ఈయన 500కి పైగా సినిమాల్లో నటించారు.ఈయన తమిళంలో నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. అందులో మోహన్ లాల్ నటించిన ‘కనుపాప'(ఒప్పం) వంటి సినిమాలు ఉన్నాయి.

మధ్యలో పలు తెలుగు సినిమాల్లో కూడా ఈయనకు ఆఫర్లు వచ్చాయి. అవి కూడా వెంకటేష్,మోహన్ బాబు, రవితేజ, రాజశేఖర్, సుమన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనే కావడం విశేషం..! కానీ ఈయన కాల్ షీట్లు ఎప్పుడూ ఖాళీగా ఉండేవి కావని.. అంత బిజీ ఆర్టిస్ట్ అని కొందరు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus