పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

సీనియర్ నటుడు సుమన్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల సుమన్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సుమన్ వద్ద అల్లు అర్జున్.. ప్రస్తావన వచ్చింది. ‘అల్లు అర్జున్ హీరోగా చేసిన మొదటి సినిమా ‘గంగోత్రి’ లో మీరు తండ్రి పాత్ర పోషించారు? ఆ సినిమాకి అతనికి పెద్దగా పేరు రాలేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు?’ అందుకు మీరు ఎలా ఫీలవుతారు? అంటూ ప్రశ్నించాడు యాంకర్.

Suman about Allu Arjun

అందుకు సుమన్ బదులిస్తూ.. ” అల్లు అర్జున్ కి తండ్రిగా ‘గంగోత్రి’ సినిమాలో నటించాను. ఆ సినిమా టైంలో ఇంత పెద్ద స్టార్ అవుతాడు అని అనుకోలేదు. అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. కచ్చితంగా ఇండస్ట్రీలో అయితే ఉంటాడు అని అనుకున్నాను. కానీ కట్ చేస్తే.. అతను ఈరోజు ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటాడు అని అనుకోలేదు. నేనే కాదు ఇండస్ట్రీలో ఎవ్వరూ అనుకోలేదు.

అదంతా అతని హార్డ్ వర్క్ తో పాటు టైం కలిసి రావడం వల్ల సాధ్యమైంది అనుకుంటాను. అప్పట్లో పాన్ ఇండియా ఇమేజ్ వంటివి ఉండేవి కాదు. అయితే అంతటి పెద్ద పాన్ ఇండియా స్టార్ మొదటి సినిమాలో తండ్రి పాత్ర చేసినందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.’గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్ సింహాద్రి అనే టీనేజ్ కుర్రాడి పాత్ర పోషించాడు. అతని తండ్రి నరసింహ అనే పాత్రలో సుమన్ నటించాడు. ఆ సినిమా ప్రారంభంలో ఎక్కువ ఎలివేషన్ సీన్లు సుమన్ కే ఉంటాయి.

రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus