ఆ సీనియర్ హీరోయిన్ త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతుందట!

శ్రీకాంత్, జేడీ చక్రవర్తి హీరోలుగా ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎగిరే పావురమా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది లైలా. అటు  తరువాత ‘ఉగాది’ .. ‘ఖైదీగారు’ .. ‘పెళ్లిచేసుకుందాం’ .. ‘పవిత్రప్రేమ’ వంటి చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గ్లామర్ కు అప్పటి కుర్ర కారు ఫిదా అయిపోయేవారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. మొత్తం కలుపుకుని 50 సినిమాల వరకూ పూర్తి చేసింది. తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి’.

ఇక తాజాగా ఈమె ఓ టీవీ షో పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ .. “తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరువాత నేను తమిళ చిత్రపరిశ్రమకి ఎక్కువ మార్కులు ఇస్తాను. ఈ రెండు భాషల్లోను నాకు మంచి ప్రోత్సాహం లభించింది. అందువల్లనే త్వరలో ఈ రెండు భాషల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను. తెలుగుతో.. తమిళంలో కూడా రూపొందే ఓ చిత్రం ద్వారా నా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో పనిచేయలేకపోయిన దర్శకులతోను కలిసి ఇప్పుడు పనిచేయాలని వుంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus