Ramaprabha, Rajinikanth: రజనీకాంత్ చేసిన ఆ పని జీవితంలో మర్చిపోలేను.. నటి షాకింగ్ కామెంట్స్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచో గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రమాప్రభ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు. ఇలా సుమారు వెయ్యి సినిమాలకు పైగా నటించి రమాప్రభ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఒక హీరోని నమ్మి దారుణంగా మోసపోయానని తన వల్ల ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నానని తెలిపారు. అన్ని పోగొట్టుకొని కట్టు బట్టలతో నడిరోడ్డు పైకి వచ్చానని రమాప్రభ తెలిపారు. ఇలా తను మోసపోవడంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా బాధపడుతున్న సమయంలో తాను సహాయం కోసం రజనీకాంత్ వద్దకు వెళ్లానని, ఆయన నాకు దారి ఖర్చులకు సహాయం చేస్తే చాలని ఆయనని సహాయం కోరాను.

అయితే ఆయన నాకు ఏమాత్రం ఆలోచించకుండా 40 వేల రూపాయలు నా చేతిలో పెట్టారు అప్పట్లో 40 వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా అడిగిన వారికి లేదనుకుండా సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి రజనీకాంత్ తనకు కూడా గొప్ప సహాయం చేశారని ఆరోజు ఆయన చేసిన ఆ సహాయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా రమాప్రభ రజనీకాంత్ తనకు చేసిన సహాయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus