Actress Sudha: సీనియర్ నటి సుధ సినిమాలకు దూరమవ్వడానికి కారణం అదేనట..!

  • December 31, 2022 / 07:19 PM IST

నటీనటులు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి… చేయగలగాలి.! అప్పుడే వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కువ ఆఫర్లు వస్తాయి. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే.. వాళ్ళను చూసినప్పుడు జనాలు బోర్ ఫీలవుతారు. సీనియర్ నటి సుధకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 500 కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈమె తల్లి, వదిన, అత్త వంటి పాత్రలు అన్నీ చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్ గా కూడా ట్రై చేసింది కానీ..

ఆ రకంగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతూ వచ్చింది. కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ‘శ్రీ వినాయక విజయం’ మూవీ ద్వారా బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత తమిళంలో 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు. అయితే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో వదిన పాత్రతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ చిత్రంలో కూడా వదిన పాత్రనే దక్కించుకుంది.

‘ఆమె’ సినిమా దగ్గరనుండి ఎక్కువగా తల్లి పాత్రల్లో నటిస్తూ వచ్చింది.ఓ సందర్భంలో ఈమెను దర్శకులు ఇవివి గారు మదర్ ఇండియా అనేవారట. అయితే కొంతకాలంగా ఈమె సినిమాల్లో కనిపించడం లేదు. అందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది సుధ. ‘ఒకప్పుడు తల్లి పాత్రలు అంటే చాలా అద్భుతంగా ఉండేవి. వాళ్లకు కథలో భాగంగా మంచి ప్రాముఖ్యత ఉండేది. మంచి మంచి డైలాగులు కూడా ఉండేవి.

అయితే ఇప్పుడు తల్లి పాత్రల్లో అలాంటి హుందాతనం ఏమి ఉండటం లేదు. ఏదో బొమ్మల్లా పెడుతున్నారు కానీ.. ఇప్పటి తల్లి పాత్రలకు డైలాగులు కూడా ఉండటం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశాను’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus