Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాల్లో అది ఎక్కువైంది.. సుహాసిని కామెంట్స్ వైరల్!

సీనియర్ నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుహాసిని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సుహాసిని రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సుహాసిని అన్ స్టాపబుల్ షోలో తాజాగా సందడి చేశారు. తాజాగా ఒక సందర్భంలో సుహాసిని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో మీరు చూస్తున్న మార్పు ఏమిటనే ప్రశ్న సుహాసినికి ఎదురైంది. సుహాసిని మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోని సినిమాలలో హింస ఎక్కువైందని ఆమె తెలిపారు. నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నానని గత 40 సంవత్సరాలలో ఇంత హింసను ఎప్పుడూ చూడలేదని సుహాసిని కామెంట్లు చేశారు. దీనికి మూడు కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఓటీటీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత హింస సామాన్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు.

హింసకు ప్రేక్షకులు అలవాటైపోయారని సాధారణ ఫైట్స్ టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్స్‌లా అనిపిస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో ఎవరైనా తల తీసేస్తా అంటే అది డైలాగ్ వరకే ఉండేదని ఇప్పుడు తల నరికేయడం చూపిస్తున్నారని సుహాసిని కామెంట్లు చేశారు. ఒక తమిళ సినిమాలో చెవిని నరికేయటం చూపిస్తే మరో మూవీలో తలను నరికేయటం చూపించారని ఆమె పేర్కొన్నారు.

కొందరు డైరెక్టర్లను మీరు ఎందుకంత హింస చూపిస్తారని అడగగా ఓటీటీ వల్ల అతిహింస లేకపోతే చూడటం లేదు మేడమ్ అని ఆ డైరెక్టర్లు చెప్పారని సుహాసిని కామెంట్లు చేశారు. రెండో కోణం సమాజంలో స్వార్థం పెరిగిపోవడం అని సుహాసిని వెల్లడించారు. ప్రశ్నించే గొంతులు తగ్గిపోవటం కూడా హింసకు కారణమని సుహాసిని పేర్కొన్నారు. నెక్స్ట్ లెవెల్, గూస్ బంప్స్ అనే కామెంట్లను అమ్మాయిల నుంచి వింటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus