మహర్షి తల్లిదండ్రులుగా నటించేది వీరే

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా మహర్షి. రైతుల సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో కాలేజ్ స్టూడెంట్ “మహర్షి” గా కొత్త లుక్ తో మహేష్ బాబు అదరగొట్టారు. ఇందులో అల్లరి నరేష్ మహేష్(మహర్షి) కి స్నేహితుడిగా కనిపించబోతున్నారు. అలాగే అలనాటి నటి జయప్రద మహేష్ తల్లిగా కనిపించనున్నట్టు కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను జయసుధ కొట్టిపడేశారు. తానే మహర్షికి తల్లిగా నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. మహర్షి తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నట్లు తెలిపారు.

జయసుధ, ప్రకాష్ రాజ్ లు మహేష్ కి తల్లిదండ్రులుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించారు. అలాగే వీరిద్దరూ తల్లిదండ్రులుగా నటించిన చిత్రాలు అనేకం హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాతో ఆ విషయం మరోసారి రుజువుకానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కెరీర్ లో నిలిపోయే విధంగా వంశీ తెరకెక్కిస్తున్నారు. అటు అమెరికా.. ఇటు ఇండియాని మిక్స్ చేసి చూపించనున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus