తెలుగు ప్రజలందరినీ తల ఎత్తుకునేలా చేసిన చిత్రం బాహుబలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఐదేళ్ల పాటు సమిష్టిగా కృషి చేసి అద్భుత కళాఖండాలను మనకి అందించారు. ఈ చిత్రాలతో తెలుగువారి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అభినందనలు గుప్పిస్తుంటే… ప్రముఖ కథా రచయిత, సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. ‘బాహుబలి-2’ చూసేందుకు తాను 10 రూపాయలు కూడా ఖర్చుపెట్టనని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమాలో ఏముందని ప్రశ్నించారు.
1951లో వచ్చిన ‘పాతాళ భైరవి’కి ఈ సినిమా కాపీ అని చెప్పారు. అంతేకాదు, ఇటువంటి చిత్రాల వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఈ సినిమా వల్ల భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. 10 కోట్లతో మనం 10 సినిమాలు నిర్మించవచ్చని, అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇటువంటి వేస్ట్ సినిమాలు తీస్తున్నారని రాజమౌళి పై ఫైర్ అయ్యారు. ఆయన మాటలు ప్రస్తుతం ఫిలిం నగర్ వాసుల్లో హాట్ టాపిక్ అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.