కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినా కానీ.. వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం మరణ వార్త ఇంకా మర్చిపోకముందే.. 23 రోజులుగా ఆసుపత్రిలో పోరాడుతున్న నటుడు నందమూరి తారక రత్న కన్నుమూశారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్ కూడా తుదిశ్వాస విడిచారు.. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మరో ప్రముఖ టెక్నీషియన్‌ని కోల్పోయింది..
‘శంకరాభరణం’ చిత్రానికి కూర్పు వహించిన జీ జీ కృష్ణారావు కన్నుమూశారు.. మంగళవారం (ఫిబ్రవరి 21) ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో ఆయన శివైక్యం అయ్యారు.. దాదాపు 200 సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. బాలకృష్ణ సోలో హీరోగా, కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ‘జననీ జన్మభూమి’ కూడా ఈయన వర్క్ చేశారు.. దాసరి, విశ్వనాథ్, జంధ్యాల, బాపు దర్శకదిగ్గజాలతో పాటు పలువురు ప్రముఖ దర్శకుల సినిమాలకు తన కత్తెరతో పదును పెట్టారు కృష్ణారావు..
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలకు వారు ఆస్థాన ఎడిటర్.. కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందారాయన.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ తీసిన క్లాసిక్ ఫిల్మ్స్ ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘శుభలేఖ’, ‘శృతి లయలు’, ‘సిరివెన్నెల’, ‘శుభ సంకల్పం’, ‘స్వరాభిషేకం’ వంటి చిత్రాలకు జీజీ కృష్ణారావ్ ఎడిటర్‌గా పని చేశారు..
‘దర్శకరత్న’ దాసరి తీసిన కమర్షియల్ క్లాసిక్స్ ఫిలింస్ అయిన ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకూ ఆయనే ఎడిటర్ కావడం విశేషం.. బాలయ్య – నయనతారలు సీతారాములుగా.. బాపు దర్శకత్వం వహించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమాకు కూడా ఎడిటర్‌గా పని చేశారు.. జీజీ కృష్ణారావు మృతికి చిత్ర పరిశ్రమ వర్గాల వారు సంతాపం తెలియజేస్తున్నారు..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?