Vijay: హీరో విజయ్ పార్టీ పై స్టార్ హీరో కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు రాజకీయాలలోకి రావడం సర్వసాధారణంగా జరిగే అంశం ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు యంగ్ హీరోలు కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు విజయ్ కూడా పొలిటికల్ పార్టీని స్థాపించి రాజకీయాలలోకి ఎంట్రీ చిన్న సంగతి తెలిసిందే. 2025వ సంవత్సరంలో తాను కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నానని తెలిపారు.

ఇక ఈయన రాజకీయాలలోనే బిజీ కానున్నారు అనే విషయం తెలిసి చాలా మంది ఫీలవుతున్నారు. ఇకపై ఈయనని సినిమాలలో చూడలేము అంటూ అభిమానులు బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈయన రాజకీయాలలోకి వస్తారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రముఖ నటుడు అరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రాజకీయాలలోకి వస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై అరవింద్ స్వామి స్పందిస్తూ.. విజయ్ (Vijay) రాజకీయాలలోకి కనుక వస్తే నేను ఆయనకు ఓటు వేయను అంటూ అరవింద్ స్వామి కామెంట్స్ చేశారు. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు సినిమాలలో హీరో ప్రజలను కాపాడినట్టు నిజ జీవితంలో కూడా కాపాడాలి అనుకోవడం సరైంది కాదని రాజకీయాలలోకి రావాలి అంటే రాజకీయం చేయడం కూడా నేర్చుకోవాలని అరవింద్ స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus