Suman: సుమన్ కూతురి పెళ్లి గురించి ఆ వార్తలు నిజమేనా.. ఏమైందంటే?

  • May 13, 2023 / 12:58 PM IST

సీనియర్ హీరోలలో ఒకరైన సుమన్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుమన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమన్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

అయితే స్టార్ హీరో ఇంటికి సుమన్ కూతురు కోడలిగా వెళ్లనుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం సుమన్ కు మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు సుమన్ హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిందనే సంగతి తెలిసిందే. తాను జైలుకు ఎందుకు వెళ్లానో తెలియదని ఆయన కామెంట్లు చేశారు. నా ప్రమేయం లేకుండా ఆ కేసులో నన్ను ఇరికించారని సుమన్ పేర్కొన్నారు.

నా కూతురు అఖిలజ ప్రత్యూషకు యాక్టింగ్ పై ఆసక్తి లేదని ఆయన తెలిపారు. తన కూతురుకు హ్యూమన్ జెనిటిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిందని సుమన్ అన్నారు. నా కూతురు స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళుతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. నా కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని కానీ పూర్తిస్థాయిలో ఆలోచించలేదని సుమన్ పేర్కొన్నారు.

నా కూతురి చదువు పూర్తైన తర్వాత పెళ్లిపై దృష్టి పెడతామని సుమన్ వెల్లడించారు. సుమన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి సుమన్ ఈ స్థాయికి చేరుకున్నారు. సుమన్ భార్య పేరు శిరీష కాగా ఆమె డీవీ నరసరాజు మనవరాలు అనే సంగతి తెలిసిందే.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus