Nani: నాని సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో?

నేచురల్ స్టార్ నాని (Nani)  ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే ‘సరిపోదా శనివారం’తో (Saripodhaa Sanivaaram)  మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తి అయిన వెంటనే ‘దసరా’ (Dasara)  ఫేమ్ శ్రీకాంత్ ఓదేల  (Srikanth Odela) దర్శకత్వంలో మరొక భారీ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రీప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుండగా, ముఖ్యమైన పాత్రల ఎంపికలో దర్శకుడు శ్రీకాంత్ ఓదేలు నిమగ్నమయ్యారు.

Nani

ఈ సినిమాలో నాని పాత్ర మునుపటి సినిమాల కంటే చాలా వైలెంట్‌గా, ఎమోషనల్‌గా ఉంటుందని టాక్. ‘దసరా’ను మించి ఈ సినిమా హిట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ ఒక సందర్భంలో చెప్పడం ఆసక్తికరం. సినిమా కోసం ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు ప్రముఖ నటుడు మోహన్ బాబును  (Mohan Babu) ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మోహన్ బాబు గతంలో విలన్‌గా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. 2018లో వచ్చిన ‘గాయత్రి’ తర్వాత ఆయన కీలక ప్రతినాయక పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక నాని సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. మోహన్ బాబు విలక్షణ నటన, నాని రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ కలిసొచ్చే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచనుంది.

ఇప్పటికే అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటంతో, టెక్నికల్ పరంగా కూడా సినిమా మరింత మెరుగ్గా ఉండబోతుందని అంచనా. మరోవైపు, మోహన్ బాబు ప్రస్తుతం మంచు విష్ణు (Manchu Vishnu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో  (Kannappa) బిజీగా ఉన్నారు. ఆ సినిమాలోనూ ఆయన పాత్రకు ప్రత్యేకత ఉంటుందని అంటున్నారు. ఇక మనోజ్ (Manchu Manoj) కూడా నెగిటివ్ పాత్రలతో ప్రయోగాలు చేస్తుండటంతో, మంచు ఫ్యామిలీ నుంచి విభిన్నమైన ప్రాజెక్టులు రాబోతున్నాయి.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus