Subbaraju Wedding Photos: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

పెళ్ళిళ్ళ సీజన్ ఇలా మొదలైందో లేదో వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు లేదంటే ఎంగేజ్మెంట్లు చేసుకుంటూ షాకిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్  (Krish Jagarlamudi)  సైలెంట్ గా రెండో మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) తోటి సింగర్ అయినటువంటి రమ్య బెహరాని (Ramya Behara) పెళ్లి చేసుకున్నాడు. అలాగే అక్కినేని హీరో అఖిల్ (Akhil)  ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక అతని అన్న అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) కూడా హీరోయిన్ శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) పెళ్ళికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతుంది.

Subbaraju Wedding Photos:

ఇంకా కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా నటుడు పెనుమ‌త్స‌ సుబ్బ‌రాజు (Subbaraju)  కూడా చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు.స్వయంగా సుబ్బరాజు తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. పెళ్లి అనంతరం త‌న భార్య‌తో క‌లిసి బీచ్‌లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసి సుబ్బరాజు ఈ విషయాన్ని తెలిపారు. అయితే సుబ్బరాజు వివాహం చేసుకున్న అమ్మాయి గురించి వివరాలు బయటకు రాలేదు.

అసలు పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదు అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సుబ్బరాజు ఫైనల్ గా 47 ఏళ్ల వయసులో సుబ్బరాజు పెళ్లి చేసుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇప్పటివరకు 50కి పైగా తెలుగు సినిమాల్లో నటించిన సుబ్బరాజు… త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళం చిత్రాల్లో కూడా విలక్షణమైన పాత్రలు చేశారు. భీమ‌వ‌రానికి చెందిన సుబ్బ‌రాజు ‘ఖ‌డ్గం’ (Khadgam) ‘ఆర్య‌’ (Aarya) ‘అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) ‘పోకిరి’  (Pokiri) ‘దేశముదురు’ (Desamuduru) ‘లీడ‌ర్‌’ (Leader) ‘బాహుబ‌లి 2’ (Baahubali 2) ‘బిజినెస్ మ్యాన్‌’ (Businessman) ‘అఖండ’ (Akhanda) ‘వాల్తేరు వీర‌య్య’ (Waltair Veerayya) వంటి సినిమాల్లో నటించారు.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus