RC15: చరణ్ శంకర్ కాంబో మూవీలో ఆ హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారా?

దిల్ రాజు నిర్మాతగా చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీలో సీనియర్ హీరోయిన్ కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సెకండాఫ్ లో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చరణ్ శంకర్ కాంబో మూవీలో ఇప్పటికే సీనియర్ హీరోయిన్ అంజలి నటిస్తుండగా కుష్బూ కూడా మరో పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

ప్రేక్షకుల అంచనాలకు అందని తరహా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. 2023 సెకండాఫ్ లో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.చరణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని ఆయన అనుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకు పాత్రల్లో నటిస్తున్నారు.

ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. చరణ్ ఈ విధంగా తండ్రీకొడుకు పాత్రలలో కనిపిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. శంకర్ సైతం ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే దిల్ రాజు మరిన్ని పాన్ ఇండియా సినిమాల దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

దిల్ రాజు మరే సినిమాకు ఖర్చు చేయని స్థాయిలో ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. 2023 సంవత్సరంలో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus