కథలు నచ్చడం లేదా ? అవకాశాలు రావడం లేదా ?
- July 11, 2017 / 02:22 PM ISTByFilmy Focus
“మంచి పాత్రలు రావడం లేదు” ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చెబుతున్న మాట ఇది. ఈ మాటలో వాస్తవం లేదని పిస్తోంది. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్స్ అయిన త్రిష, తమన్నా, శ్రీయ, నయనతార, అనుష్కలు స్టార్ హీరోలతో నటించారు. ఎక్కువ శాతం సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో సినిమాలు లేవు. అనుష్క బాహుబలి తర్వాత భాగమతి తప్ప ఏ చిత్రానికి సైన్ చేయలేదు. సాహోలో ఉంటుందని ఊరించినప్పటికీ అది కూడా చేయి జారిపోయినట్టు సమాచారం. త్రిష కూడా ఏ స్టార్ హీరో సినిమాతో ఇప్పుడు సినిమా చేయడం లేదు. నయనతార అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సర్దుకుపోతోంది.
శ్రీయ మాత్రం చిన్న చిన్న రోల్స్ లో తళుక్కున మెరుస్తోంది. తమన్నా పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. బాహుబలి తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు ఎక్కువగా వస్తాయని అనుకుంటే రాకపోవడంతో చిన్న సినిమాలను ఒకే చేసింది. సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి కూడా సై అంది. వీరి ప్రస్తుత కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే.. యువ హీరోయిన్లు సీనియర్ హీరోయిన్ల అవకాశాలను తన్నుకుపోతున్నట్లు అనిపిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













