ఎన్నో సినిమాలలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా బాలనటిగా నటించిన తులసి అనంతరం హీరోయిన్గా నటించారు. ఇలా హీరోయిన్ గా నటించిన ఈమె అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. ఇలా ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తున్న ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
ఇలా ఫేస్ బుక్ తో పాటు ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే ఇన్స్టాగ్రామ్ లో 50 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇలా ఈమెకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ విధంగా అభిమానులు తనపై చూపిస్తున్నటువంటి ప్రేమకు ఈమె ఎంతో ఎమోషనల్ అవుతూ…
నా మీద మీకు ఇంత ప్రేమ ఏంటండీ బాబోయ్, నేను రుణపడి ఉన్నానండి మీ అందరికీ, మీ ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను, చాలండీ నాకు ఇంకేం అక్కర్లేదు, ఇది ఎంతో ఎంతో గొప్ప విషయం ఇదే నా ఆస్తి, ఇంకా చాలు నా మీద మీరు కురిపిస్తున్న ప్రేమ చాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈమె తనపై చూపిస్తున్న ప్రేమను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా కన్నడ హిందీ భోజ్పురి సినిమాలలో నటించారు. ఇలా అన్ని భాషలలో కలిపి ఈమె సుమారు 300 సినిమాలలో నటించి మెప్పించారు. వివాహం తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.