సెప్టెంబర్ నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల 1వ తేదీన ఖుషి సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా పలు ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా ఫెయిలైంది. ఈరోజు నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
సెప్టెంబర్ నెల 7వ తేదీన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్ సినిమాలు విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. ఛాంగురే బంగారు రాజా, అను, రామన్న యూత్, సోదర సోదరీమణులారా, మార్క్ ఆంటోని సెప్టెంబర్ మూడో వారంలో రిలీజయ్యాయి. ఈ సినిమాలలో మార్క్ ఆంటోని బిలో యావరేజ్ అనిపించుకుంది.
మిగతా సినిమాలు మాత్రం ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేదు. బిచ్చగాడు మూవీ రీ రిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. రుద్రంకోట, అష్టదిగ్భందనం సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ కావడం గమనార్హం. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో డబ్ కాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేదు.
సెప్టెంబర్ చివరి వారంలో స్కంద, చంద్రముఖి2, పెదకాపు1 సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు లేవు. భారీ బడ్జెట్లతో తెరకెక్కిన ఈ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలు పోటీ లేకుండా విడుదలై ఉంటే బెటర్ ఫలితాలు దక్కేవి. లాంగ్ వీకెండ్ ను ఈ సినిమాలలో ఏ సినిమా కూడా ఉపయోగించుకునే అవకాశాలు అయితే లేవు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !