త్రినయని చందు మృతిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర , చందు రెండు రోజుల గ్యాప్ లో మృతి చెందడం ఫ్యాన్స్ ను ఎంతో బాధ పెట్టిన సంగతి తెలిసిందే. చందు మృతి గురించి తల్లి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. చందు తల్లి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి చందు పవిత్రతోనే ఉంటున్నాడని చెప్పుకొచ్చారు. చందు, పవిత్ర పెళ్లి చేసుకుంటామని చెప్పారని చందు తల్లి కామెంట్లు చేశారు.

అప్పటినుంచి చందు తన భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశారని చందు తల్లి అన్నారు. ప్రమాదం తర్వాత చందు మాతో మాట్లాడలేదని ఆమె చెప్పుకొచ్చారు. నా కోడలు, నేను చందును చూడటానికి వెళ్లగా మమ్మల్ని చందు దగ్గరకు కూడా రానివ్వలేదని ఆమె తెలిపారు. చందు భార్యను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని ఆమె వెల్లడించడం గమనార్హం. చందు తాగి వచ్చి భార్యను తిట్టేవాడని కొట్టేవాడని చందు తల్లి అన్నారు.

చందు మారతాడేమో అని అందరూ ఎదురు చూశామని అయితే చందులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆమె వెల్లడించారు. యాక్సిడెంట్ తర్వాత చందు అతని స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. పవిత్ర ఎల్.ఐ.సీ డబ్బుల కోసం వెళ్తున్నానని చెప్పి చందు బయటకు వెళ్లాడని అతని తల్లి పేర్కొన్నారు. ఆ తర్వాత మేము ఫోన్ చేసినా చందు లిఫ్ట్ చేయలేదని ఆమె వెల్లడించారు.

ఆ తర్వాత చందు మరణవార్త గురించి తెలిసిందని చందు తల్లి పేర్కొన్నారు. చందు తల్లి వెల్లడించిన సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి. చందు భార్య సైతం సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. చందు ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రకాంత్ మరణం అతని ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus