‘ప్రభాకర్ గారి ‘వదినమ్మ’ సీరియల్ షూటింగ్ లో పాల్గొనడం వల్లనే నాకు కరోనా వచ్చింది. హాస్పిటల్ లో పది రోజులు ఉన్నాను. ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ మా యూనిట్ సభ్యులు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నేను సినిమాల్లో నటించడం మానేసి ఐదేళ్లు అవుతున్నప్పటికీ…. జీవిత రాజశేఖర్ గారు వచ్చి నన్ను పరామర్శించారు. కానీ ‘వదినమ్మ’ టీం సభ్యులు మాత్రం రాలేదు. కనీసం నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు కూడా వచ్చే అవకాశం కూడా కల్పించడం లేదు. నాకు ఇలాంటి పరిస్థితి రావడం వల్లనే మనుషులు ఎలా ఉంటారో…. అర్ధమయ్యింది’ అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు సీనియర్ నటి శివ పార్వతి.
దాంతో బుల్లితెర మెగాస్టార్ అయిన ప్రభాకర్ వెంటనే ఓ వీడియో ద్వారా ‘శకుంతల గారి అబ్బాయితో మేము మాట్లాడాం. కానీ ఆ విషయం ఆవిడకు తెలీదు. అమ్మ త్వరగా కోలుకోవాలి. మేమంతా ఆమెకు తోడుగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకేనేమో ఇప్పుడు ఆ మాటలు అన్నీ మార్చేశారు శకుంతల గారు.. ” ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అలాగే నా తోటి నా తోటి నటీనటులు ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు.
పరుచూరి బ్రదర్స్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. నాకు ఏ విషయంలోనూ ఇబ్బంది లేదు. నేను పనిచేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ స్పందించలేదని మాత్రమే ఓ వీడియో పెట్టాను. అది అందరికీ మనస్తాపానికి గురిచేసింది.నాకు సానుభూతి, ఆర్థిక సాయం అవసరం లేదు.. మోరల్ సపోర్ట్ కావాలని మాత్రమే ఆ వీడియో చేశాను” అంటూ సెకండ్ వెర్షన్ వీడియోని రిలీజ్ చేసింది శివ పార్వతి. ఈమె గతంలో ‘యమదొంగ’ ‘శ్రీరామరాజ్యం’ ‘నేనున్నాను’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?