షేక్ అవుతున్న టాలీవుడ్….

  • November 9, 2016 / 06:36 AM IST

మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న సంచలన నిర్ణయం….అదే 500, 1000నోట్లను రద్దు చెయ్యడం ఎంతో శుభ పరిణామం అయినప్పటికీ సామాన్యుడు అనేక ఇక్కట్లు పడుతున్నాడు. అయితే అదే క్రమంలో ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ ఈ ప్రభావం చాలా పరిశ్రమాలపై పడటం ఖాయంగానే కనిపిస్తుంది…అందులోనూ సినిమా పరిశ్రమపై ఈ ప్రభావం చాలా భారీగా పడుతుంది…ముఖ్యంగా టాలీవుడ్ కి అయితే.. ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చంటున్నారు ట్రేడ్ వర్గాలు….దానికి గల కారణాలు సైతం చాలానే ఉన్నాయి.

ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా…కొన్ని గంటల వ్యవధిలోనే 500, 1000 నోట్లను రద్దు చెయ్యడంతో 100నోట్ల డినామినేషన్ తో పెద్ద మొత్తాలను కూడబెట్టడానికి వీలుకడు… అదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలో రోజువారి సెటిల్మెంట్స్ చాలానే ఉంటాయి. కార్మికుల వేతనాలు ఎక్కువగా ఈ రూపంలోనే పేమెంట్స్ అవుతూ ఉంటాయి. ఇదే అతి పెద్ద సమస్యగా పరిణమించే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ విషయానికొస్తే.. క్యాష్ పేమెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. బ్యాంకుల్లో డబ్బులు వేయడం.. చెక్కుల రూపంలో చెల్లించడం లాంటివి బాగా అరుదు. ఇక ఈ రద్దు వల్ల….మన సినిమాల షూటింగ్ వాడియా పడినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు… చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus