‘సు ఫ్రమ్ సో’ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన రాజ్ బి.శెట్టిని మన మీడియా ఓ ప్రశ్న వేసింది. కన్నడ సినిమా అంటే మొత్తం ముగ్గురు చుట్టూనే తిరుగుతోంది కదా. మీరు చేస్తున్న సినిమాలే విజయాలు అందుకుంటున్నాయి కదా అని. ఆ మాటకు రాజ్ బి.శెట్టి ఓకే అవ్వలేదు. లేదు లేదు అలాగేమీ లేదు అని క్రెడిట్ మొత్తం శాండిల్‌వుడ్‌కి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమా వచ్చాక మరోసారి అదే చర్చ మొదలైంది. అలాగని కన్నడ సినిమాలో మిగిలిన వాళ్లు హిట్స్ తీయడం లేదని కాదు.. వీళ్లు ఎక్కువగా తీస్తున్నారని.
మనకు ఓ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఉన్నట్లే.. శాండిల్‌వుడ్‌లో కూడా ఓ RRR ఉంది. మనది సినిమా అయితే.. అక్కడ సినిమాలు తీసే వాళ్లు. వాళ్లే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ బి. శెట్టి. ఈ త్రయం చూట్టే కన్నడ సినిమా ఇప్పుడు తిరుగుతోంది అనేది విశ్లేషకుల మాట. వీరి కలయికలో ‘గరుడ గమన వృషభ వాహన’ అనే సినిమా వచ్చింది తెలిసే ఉంటుంది. రక్షిత్ శెట్టి సమర్పణలో.. రాజ్ బి.శెట్టి, రిషబ్ శెట్టి నటులుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఎవరికి వారు వారి సినిమాలను తీసుకుంటూ వచ్చారు. మధ్యలో ఒకరికి ఒకరు సాయం చేసుకున్నారు కూడా. రిషభ్ నటిస్తూ, తెరకెక్కించిన ‘కాంతార’ ఇక రక్షిత్ శెట్టి నటుడు, దర్శకుడు, నిర్మాతగా అదరగొడుతున్నాడు. ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి’ రెండు భాగాలు అతని టాలెంట్‌కి మచ్చుతునుకలు. ఇన్ని సినిమాలు, వాటి ప్రత్యేకతుల చెప్పాక.. శాండిల్‌వుడ్‌కి వాళ్లు చాలా స్పెషల్ అంటే ఒప్పుకోకుండా ఉంటారా చెప్పండి.
ఇదంతా ఓకే కానీ.. వీరికే ఎందుకు వరుస సినిమాలు క్లిక్ అవుతున్నాయి అనేగా మీ డౌట్. వీళ్లు కన్నడనాట కోర్ అంశాలను వాళ్లు పట్టుకున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే శాండిల్ వుడ్ మట్టి వాసనను పట్టేశారు. అందుకే విజయాలు సాధిస్తున్నారు.