Shah Rukh Khan: గుండుతో ఉన్న అమ్మాయిలంటే ఇష్టం… షారుఖ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

  • September 16, 2023 / 08:54 PM IST

బాలీవుడ్‌ హీరోలు ఒక మైండ్‌సెట్‌లో ఉంటారు… ప్రయోగాలకు ముందుకొచ్చే వాళ్లు తక్కువమంది ఉంటారు. మిగిలిన వాళ్లు ఒకే తరహా సినిమాలు చేస్తుంటారు. ప్రయోగాలు చేయడానికి, తాము లార్జర్‌ ద్యాన్ లైఫ్‌ అనే ఫీలింగ్‌లోనే ఉంటారు అని అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలీవుడ్‌లో స్టీరియో టైప్‌ హీరో అనే అపవాదు ఉన్న షారుఖ్‌ ఖాన్‌ కూడా ఇప్పుడు ఆవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆలోచన చేశాడు. ‘జవాన్‌’ సినిమాలో ఆయన ఏకంగా గుండుతో కనిపించాడు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు.

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘జవాన్‌’. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా రూ. 700 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇంకా ఆ వసూళ్ల సునామీ కొనసాగుతోంది. ఈ సినిమాలో షారుఖ్‌ చాలా రకాల గెటప్స్‌లో కనిపించాడు. అందులో గుండు గెటప్‌ ఒకటి. ఆ గెటప్‌లో షారుఖ్‌ను చూశాక అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. షారుఖ్‌ లాంటి స్టార్‌ హీరో ఇలా చేసేసరికి వావ్‌ అనుకున్నారు. అయితే ఇదంతా బద్దకం వల్ల జరిగింది అనేది లేటెస్ట్‌ సమాచారం.

‘జవాన్’ సినిమాలో గుండుతో నటించాలని దర్శకుడు అట్లీ అడిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అని అడిగితే బద్దకం కారణంగానే సినిమాలో ఆ లుక్‌ను ఎంచుకున్నా అని చెప్పి షారుఖ్‌ మరింత షాక్‌కి గురి చేశాడు. నిజానికి గుండు లుక్ స్క్రిప్ట్‌లో అసలు భాగమే కాదట. అప్పటికే సినిమా కోసం కొన్ని లుక్స్‌ చేశానని, వాటికి మేకప్‌ కోసం చాలా సమయం పట్టిందని, మళ్లీ ఇంకో లుక్‌ అంటే మేకప్‌ కోసం రెండు గంటలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. అందుకే ఏ ఇబ్బందీ లేకుండా గుండు లుక్‌కు ఓటేశాను అని చెప్పాడు షారుఖ్‌.

అంతేకాదు గుండు లుక్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తన ఫ్రెండ్స్‌కి కూడా చూపించాడట. వాళ్లే ఆ లుక్ భయంకరంగా ఉంది అన్నారట. అమ్మాయిలైతే ఈ లుక్‌లు నిన్ను చూస్తే లైక్ చేయరు అని కుండబద్దలు కొట్టేశారట. అయితే అమ్మాయిలకు నచ్చుతుందనే ఆలోచనతోనే చేశానని, ఇప్పుడు అదే నిజమైంది అన్నాడు షారుఖ్‌. గుండుతో ఉన్న మగాళ్లను అమ్మాయిలు ఇష్టపడతారని తన నమ్మకమని, అంతేకాదు తనకు కూడా గుండుతో ఉన్న అమ్మాయిలంటే ఇష్టం అని సరదాగా చెప్పాడు (Shah Rukh Khan) షారుఖ్‌.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus