Guntur Kaaram: ‘గుంటూరు కారం’, షారుఖ్ … సరిగ్గా తెలుసుకోవాలి కదా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా రూపొందింది. జనవరి 12 న అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ కలెక్షన్స్ ను సాధించింది ఈ సినిమా. అలాగే మహేష్ బాబు ఈ సినిమాలో వన్ మెన్ షో చేశాడు.

అతని మేనరిజమ్స్, డైలాగ్స్, కామెడీ టైమింగ్ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గుంటూరు కారం’ విషయంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ట్రోల్ అవుతుండటం అందరికీ షాకిచ్చింది. విషయం ఏంటంటే.. నిన్న ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అయితే ఈరోజు షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్లో ‘ ‘గుంటూరు కారం’ మూవీ కోసం ఎదురుచూస్తున్నా మిత్రమా..

ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌, ఎమోషన్స్‌ తో అదిరిపోయింది. మాస్‌ నెక్ట్స్‌ లెవల్‌’ అంటూ మహేష్ బాబుని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ వేశాడు. నిన్న సినిమానే రిలీజ్ అయితే ఈరోజు ట్రైలర్ పోస్ట్ చేసి దాని టాక్ చెబుతున్నాడేంటి షారుఖ్ అంటూ అందరూ విమర్శిస్తున్నారు. సాధారణంగా ఓ హీరో సినిమా రిలీజ్ అయితే మిగతా హీరోలు ఆ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ అభినందిస్తూ ఉంటారు.

కానీ షారుఖ్ (Guntur Kaaram) మాత్రం నిన్న రిలీజ్ అయిన సినిమాని, దాని టాక్ ను వదిలేసి .. ట్రైలర్ ని షేర్ చేసి దాని రివ్యూ చెప్పడం అందరికీ షాకిచ్చింది. అందుకే కొంతమంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus