Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న కాంబో మూవీలో షారుఖ్ అలాంటి రోల్ లో కనిపిస్తారా?

  • September 10, 2023 / 06:20 PM IST

మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా అదే సమయంలో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ను మార్చుకోవడంతో పాటు ఎంతో కష్టపడనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారు.

ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారంశం. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం ఈ సినిమా ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకునే అవకాశంతో పాటు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు కానుందని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీలో ఒక బాలీవుడ్ హీరోయిన్, ఒక హాలీవుడ్ హీరోయిన్ నటించనున్నారని సమాచారం అందుతోంది. మహేష్ ఈ సినిమాకు రెండు సంవత్సరాల డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. మహేష్ ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికంగా అందుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో మహేష్ రాజమౌళి కాంబో మూవీ తెరకెక్కనుంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2026 ఫస్ట్ హాఫ్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. మహేష్ జక్కన్న బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. జక్కన్న ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మహేష్ రాజమౌళి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో మహేష్ మార్కెట్ పది రెట్లు పెరగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus