Gauri Khan: ఆర్యన్ ఖాన్ అరెస్టుపై తొలిసారి స్పందించిన గౌరీఖాన్!

గత ఏడాది క్రూయీజర్ డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అధికారులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన తప్పు ఏమాత్రం లేదంటూ ఎన్సీబీ అధికారులు ఆర్యన్ కి క్లీన్ చీట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే విచారణ పేరుతో అధికారులు ఆర్యన్ ఖాన్ ను ఎంతో హింసించారని, తనకు బెయిల్ రాకుండా దాదాపు 21 రోజులపాటు తనని అధికారులు తమ కస్టడీలో ఉంచుకొని ఎన్నో హింసలకు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

అయితే విచారణ అనంతరం ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే తన కొడుకు డ్రగ్స్ విషయంపై ఎక్కడ స్పందించని గౌరీ ఖాన్ తాజాగా ఈ విషయంపై మౌనం వీడారు. తాజాగా ఈమె కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. భావన పాండేతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరీ ఖాన్ కి కరణ్ నుంచి తన కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు

మీ కుటుంబం ఎంత బాధపడిందో అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా ధైర్యం ఉండాలి అంటూ మాట్లాడారు. ఆ కష్ట సమయం గురించి మీరు ఏమని సమాధానం చెబుతారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గౌరీ ఖాన్ సమాధానం చెబుతూ.. అవును ఆ సమయంలో మా కుటుంబం ఎంతో బాధపడింది. అయితే ఒక తల్లిగా ఆ బాధను మరింత ఎక్కువగా అనుభవించాను. ఒక తల్లికి అంతకుమించి నరకం మరొకటి ఉండదు అయితే మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మా కుటుంబంలా మాకు అండగా నిలబడి,

మాకు పరిచయం లేని వారు కూడా మెసేజ్, కాల్స్ చేస్తూ మాకు ఎంతో మద్దతు తెలుపుతూ అండగా నిలబడ్డారు. ఈ విధంగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో మాకు మద్దతుగా నిలబడి మమ్మల్ని ఓదార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా గౌరీ ఖాన్ తన కొడుకు అరెస్టు అయిన సంఘటనని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇలా మొదటిసారి తన కుమారుడి అరెస్టు గురించి ఈమె మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus