అదరగొడుతున్న శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్!

పొగరు అత్త.. ఆమె అహంకారాన్ని అణిచి వేసే అల్లుడు.. ఈ కాన్సెప్ట్ వెండితెరపైన అద్భుతంగా ఉంటుంది. అలా అత్త అల్లుడి మధ్య పోటీ కథతో మారుతి రూపొందించిన మూవీ శైలజారెడ్డి అల్లుడు. శైలజా రెడ్డి గా రమ్యకృష్ణ, అల్లుడిగా నాగ చైతన్య పోటీపడుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ కి విశేష స్పందన వచ్చింది. టన్నుల కొద్ది ఈగో కలిగిన శైలజ రెడ్డి కూతురిగా అను ఇమ్యానుయేల్ నటించిన ఈ చిత్రం ఈరోజు ( ఆగస్టు 31న ) రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి సెప్టెంబర్ 13 న థియేటర్లోకి వస్తోంది. అయితే అక్కినేని అభిమానుల కోసం ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.

“పుచ్చకాయ అంత ప్రేమ ఉందా.. ఇంత అంతా అని ఒక కాయ సైజు లో చెప్పలేను”,  “ఈ తల్లీ కూతుళ్ళ మధ్య మీరు.. మీ ప్రేమ నలిగి పోవడం ఖాయం” వంటి డైలాగులు సినిమాలో నవ్వులకు కొదవలేదని చెబుతున్నాయి. అలాగే అను, చైతన్యల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని, అత్తకి అల్లుడి కి మధ్య ఈగో పోరు రసవత్తరంగా ఉంటుందని కనిపిస్తోంది. మొత్తానికి కుటుంబసభ్యులందరూ కలిసి ఎంజాయ్ చేసేలా మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus