Guppedantha Manasu August 12th: రిషి విషయంలో కొత్త ప్లాన్ అమలు చేయబోతున్న శైలేంద్ర!

  • August 12, 2023 / 11:25 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే… వసుధార రిషి కోసం కాఫీ తీసుకెళ్లి మీరు ఒకసారి మహేంద్ర సార్ కి ఫోన్ చేసి మాట్లాడండి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ రిషికి సలహా ఇస్తుంది. ఎప్పుడు నేను ఏపని చేయాలో నాకు తెలుసు నువ్వేమీ చెప్పాల్సిన పనిలేదు అనే రిషి అనడంతో మీకు అన్ని విషయాలు తెలుసు కానీ నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను అని వసుధార మాట్లాడుతుంది.

అందరి సంతోషం గురించి ఆలోచిస్తావు మరి నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టావు అని రీషి అనడంతో నేను కూడా మిమ్మల్ని ఏమీ బాధ పెట్టలేదు ఆ క్షణానికి నేను చేసిన ఆ పని మిమ్మల్ని సంతోష పెట్టడానికి మిమ్మల్ని కాపాడడానికి అని వసుధార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ క్షణం నన్ను కాపాడటానికి మీరు నన్ను బాధపెట్టిన మీరు చేసినది తప్పు ఎప్పటికీ తప్పే ఈ విషయంలో క్షమించేది లేదు అంటూ రిషి అనుకుంటారు.మరోవైపు శైలేంద్ర కాలేజీలోకి అడుగు పెడతారు.

అక్కడికి వెళ్లి ప్రిన్సిపల్ దగ్గర డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. ఎందుకు ఇంత స్ట్రెంత్ తగ్గిందని అడగడంతో కాలేజ్ ప్రిన్సిపల్ రిషి సార్ లేకపోవడం వల్ల స్ట్రెంత్ మొత్తం తగ్గిపోయింది. సర్ ఆయన ఉంటే అడ్మిషన్ నుంచి ప్రతి ఒక్కటి చాలా బాధ్యతగా తీసుకొని చేశారు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవడం లేదు అంటూ ప్రిన్సిపల్ చెబుతారు.మరోవైపు కారులో మహేంద్ర జగతి ప్రయాణిస్తూ శైలేంద్ర కాలేజీకి వస్తున్నారు అంటే ఏదో ప్లాన్ చేసే ఉంటారని మాట్లాడుకుంటారు.

తనకు లాభం లేకపోతే శైలేంద్ర ఏ పని చేయరు అలాంటిది కాలేజీకి వస్తున్నారు అంటే మరోసారి ఏం ప్లాన్ చేశారో అని మాట్లాడుతారు.మరోసారి ఏమైనా రిషికి అపాయం తలపెట్టబోతున్నారా నా కొడుకుని బాధపెడుతున్నటువంటి వ్యక్తి కళ్ళముందే తిరుగుతున్న ఏమి చేయలేని పరిస్థితి అంటూ మహేంద్ర బాధపడతారు. మనం రిషిని కాలేజ్ నుంచి పంపించాం తిరిగి కాలేజ్ కి రప్పించాలి అంటే కాలేజ్ డెవలప్ చేసి రిషి చేతిలో పెట్టాలని మాట్లాడుకుంటారు. అలాగే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్ విష్ కాలేజీకి పంపించాలని జగతి చెబుతుంది.

ఇకపోతే శైలేంద్ర ఒకచోట ఆగి ఒక వ్యక్తికి ఫోన్ చేసి రమ్మంటారు.ఈ దెబ్బతో నేను అనుకున్న పని మొత్తం పూర్తి అవుతుందని శైలేంద్ర సంతోషపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి రావడంతో నేను చెప్పినట్టు చేసావా అని శైలేంద్ర అడుగుతారు. మీరు చెప్పిన దానికంటే ఎక్కువే చేశాను సర్ కావాలంటే చూడండి అంటే ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ చూసిన శైలేంద్ర ఎంతో సంతోషపడి అతని చేతిలో కాస్త డబ్బు పెట్టి పంపిస్తారు.మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఫైల్ విష్ కాలేజ్ కు పంపించాలని జగతి చెప్పడంతో కాలేజ్ ప్రిన్సిపాల్ కి మహేంద్ర ఫోన్ చేస్తారు.

ప్రిన్సిపల్ గారితో మహేంద్ర మాట్లాడుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ రెడీ అయింది మీకు పంపిస్తాము మీరు చైర్మన్ గారికి చెబితే వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పడంతో అయ్యో ఇప్పుడు చైర్మన్ గారికి హెల్త్ బాగాలేదు రిషి సార్ ఆయన పనుల మీదే ఉన్నారు కొద్ది రోజులు ఆగి పని మొదలు పెడదామని చెబుతారు. ఫోన్ పెట్టేసిన మహేంద్ర మన కొడుకుని సొంత బిడ్డలా చూసుకునే అతనికి ఇలా అయింది ఏంటి మనం ఒకసారి వెళ్లి పలకరించి వద్దాం జగతి అనడంతో వద్దు మహేంద్ర మనం అక్కడికి వెళ్తే రిషి బాధపడతారు అతనికి ఫోన్ చేసి పలకరిద్దాం అంటూ మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ (Guppedantha Manasu) పూర్తి అవుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus