సంపూ “కొబ్బరిమట్ట”లో షకీలా కూడా!

శృంగార తారగా షకీలా, కమెడియన్ గా సంపూర్నేష్ బాబు. ఈ ఇద్దరూ ఎవరి కేటగిరీల్లో వారు టాప్. ఈ ఇద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది?. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే సంపూర్నేష్ కొత్త సినిమా “కొబ్బరిమట్ట” విడుదలవరకూ వేచి చూడాల్సిందే.

“హృదయకాలేయం” అనంతరం సాయిరాజేష్ దర్శకత్వంలో సంపూ నటిస్తున్న చిత్రం “కొబ్బరిమట్ట”. ఈ సినిమాలో షకీలా ఓ కీలకపాత్రలో కనిపించనుందట. ఈ విషయాన్ని దర్శకుడు సాయిరాజేష్ నీలం తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలిపాడు!

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus