Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 2వ వారం అనూహ్యంగా మార్పులు..! ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలాగో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఘట్టం రసవత్తరంగా మారింది. అన్ అపీషియల్ పోలింగ్స్ లో చూస్తే షకీల అందరికంటే లీస్ట్ లో ఉంది. అయితే, పవర్ అస్త్రా సంపాదించే రేస్ లో ఉంది కాబట్టి అందరూ షకీల వెళ్తుందా లేదా అనే అనుమానంలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే షకీల ఇంటి నుంచీ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, 4వారాల ఇమ్యూనిటీ మాత్రం శివాజీ సాధించాడు. నిజానికి షకీల సెకండ్ టైమ్ బిగ్ బాస్ చెవిలో అరిచినపుడు గ్రాఫ్ చాలా బాగుంది. హౌస్ మేట్స్ కూడా షకీల గెలిచే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా శివాజీ తన మాస్టర్ బ్రైయిన్ తో గేమ్ లో గెలిచాడు. 4వారాల ఇమ్యూనిటీ కైవసం చేసుకున్నాడు. దీంతో షకీల ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అయితే ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండచ్చనేది సోషల్ మీడియోలో వినిపిస్తున్నా టాక్.

ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ మేట్స్ ఇవ్వకపోతే ఇక వచ్చే వారాల్లో వచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. అప్పటికే హౌస్ మేట్స్ అందరూ సెటిల్ అయిపోతారు. వారికి ఓటింగ్ ప్రకారం కూడా రీచ్ బాగుంటుంది కాబట్టి వాళ్లు హౌస్ లో ఎడ్జెస్ట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుకే, ఈవారం ఇద్దరిని హౌస్ లోకి పంపించే అవకాశం కనిపిస్తోంది. జబర్ధస్త్ షో నుంచీ బుల్లెట్ భాస్కర్ ఈవారం హౌస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుల్లెట్ బాస్కర్ మరి ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరం. ఇక సీక్రెట్ రూమ్ లో ఎవరైనా ఉంటారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే సీక్రెట్ రూమ్ ని రెడీ చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సీక్రెట్ రూమ్ లో ఎవరెవరు ఉంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లు అక్కడ ఉంటారా అనేది కూడ ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని పెంచుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బుల్లెట్ భాస్కర్ వస్తే డైరెక్ట్ గా హౌస్ లోకి వెళ్తాడా లేదా గేమ్ ఆబ్జర్వ్ చేసుకోవడానికి సీక్రెట్ రూమ్ లో రెండు మూడు రోజులు ఉంటాడా అనేది చూడాలి. అలాగే, ప్రస్తుతం హౌస్ లో షకీల ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కేవలం 12మంది మాత్రమే ఉంటారు. మరి ఈ 12మంది నెక్ట్స్ నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారు అనేది కూడా చూడాలి. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus