Chiranjeevi: చిరంజీవి వైరల్‌ పిక్‌.. ఆ ఒక్కరే మిస్సింగ్‌.. మీరు చూశారా?

కొన్ని ఫొటోలు చూస్తే భలే ముచ్చటేస్తుంది. అందులోను అవి ‘అప్పుడు – ఇప్పుడు’ కాన్సెప్ట్‌ ఫొటోలు అయితే ఇంకా ముచ్చటేస్తుంది. అలాంటి ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) రీయూనియన్‌. అవును మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) , అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) తెరకెక్కించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రీయూనియన్‌ జరిగింది. ఈ క్రమంలో 34 ఏళ్ల ముందు, ఇప్పుడు అంటూ ఆ ఫొటో వైరల్‌గా మారింది.

‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సెట్స్‌లో చిరంజీవి – అజిత్‌ (Ajith Kumar) ఇటీవల కలుసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అయితే తాజాగా అజిత్ భార్య షాలిని (Shalini Ajith) కూడా రెండు ఫొటోలను షేర్‌ చేశారు. అందులో ఒకటి 34 ఏళ్ల క్రితంది కాగా, రెండోది ఇటీవల తీసింది. అందులో చిరంజీవితోపాటు సోదరి షామ్లీ (Shamlee) , సోదరుడు రిచర్డ్ రిషి (Richard Rishi) కూడా ఉన్నాడు. ఈ ముగ్గురూ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో నటించిన వాళ్లే అనే విషయం తెలిసిందే.

కొత్త ఫొటో ఎప్పుడు తీశారు నేది తెలియదు కానీ.. దాదాపు 34 సంవత్సరాల తర్వాత వీళ్లు మరోసారి మెగాస్టార్‌ను కలిశారు అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. షాలిని, షామిలి హీరోయిన్లుగా నటించారు. ఇక రిషి కూడా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో సినిమాల్లో హీరోగా చేశాడు. తెలుగులో ‘ఏ ఫిలిం బై అరవింద్’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ లాంటి సినిమాలతో అలరించాడు. ఈ వీడియోలోని ఫొటోలను కట్‌ చేసి ‘అప్పుడు – ఇప్పుడు’ అంటూ కొలేజ్‌ చేసి అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

అయితే ఈ రెండు ఫొటోల్లో ఉన్న ఏకైక డిఫరెన్స్‌ శ్రీదేవి. ఆమె ఇప్పుడు కూడా ఉండి ఉంటే ఫుల్‌ ఫిల్‌గా ఉండేది అని అనుకుంటున్నారు ఆమె అభిమానులు. వైరల్‌ పిక్‌లో అదొక్కటే మిస్సింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘జగదేక వీరుడు’ చిరంజీవి ఇప్పుడు అలాంటి పాత్రలోనే ‘విశ్వంభర’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus