తమ పై గతంలో లైంగిక దాడులు జరిగాయనని కొందరు సినీ నటీమణులు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ‘మీటూ’ అనే పేరుతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడిప్పుడే ఈ ఉద్యమం హడావిడి కొద్ది కొద్దిగా తగ్గుతుంది అనుకునేలోపు మరికొందరు నటీమణులు.. ‘మమ్మల్ని కూడా కొందరు దర్శక నిర్మాతలు, హీరోలు వేధించారని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పడు కూడా… ఓ ప్రముఖ దర్శకుడు ‘నా కోరిక తీరిస్తే విజయ్ దేవరకొండతో తీయబోయే సినిమాలో అవకాశం ఇస్తానని ప్రముఖ కోలీవుడ్ నటి షమ్ము కి ఆఫర్ ఇచ్చాడట.
ఈ భామ శివ కార్తికేయన్ సినిమా ‘మిస్టర్ లోకల్’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. తన ఇన్స్టాగ్రామ్లో నెటిజన్లతో ముచ్చటించిన ఈ భామ తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని తెలిపింది. ఈ క్రమంలో ఓ నెటిజన్… ‘మీకు ఎప్పుడైనా లైంగిక వేధింపుల సందర్భం ఎదురైందా?’ , ‘ఆ వేధింపుల కారణంగా ఏమైనా అవకాశాలు కోల్పోయారా?’ అంటూ అడిగాడు. దీనికి షమ్ము సమాధానమిస్తూ… “నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను, అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు కాబట్టి ఫిర్యాదు చేయను. ఒకవేళ ఫిర్యాదు చేసినా.. ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎదుటి వ్యక్తి తన తప్పును ఒప్పుకోడు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ దర్శకుడు ‘నా కోరిక తీరిస్తే, నేను విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోయే సినిమాలో అవకాశం ఇస్తాను’ అంటూ నన్ను ఇబ్బంది పెట్టాడు” అంటూ ఆరోపించింది షమ్ము. అయితే ఆ దర్శకుడి ఎవరనేది మాత్రం ఆమె బయటకి చెప్పలేదు.