నిర్మాతలతో తేల్చుకోనున్న శంకర్!

ఎన్నో భారీ చిత్రాలను రూపొందించిన సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శంకర్. రెండేళ్ల క్రితం ఆయన రూపొందించిన ‘2.0’ సినిమా తరువాత.. ‘ఇండియన్ 2’ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించాలనుకున్నారు. కమల్ హాసన్ హీరోగా సినిమా కూడా మొదలుపెట్టారు . అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి ఏదొక అవాంతరం వస్తూనే ఉంది.

ప్రారంభంలోనే సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో శంకర్ విభేదాలు రావడంతో కొంత కాలం షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ రాజీ పడడంతో షూటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత షూటింగ్ స్పాట్‌లో క్రేన్ యాక్సిడెంట్ జరిగి యూనిట్ మెంబర్స్ చనిపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ ఘటనకు కారణం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే అంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలం షూటింగ్ ఆగింది. చివరికి కరోనా ఈ సినిమాకి పెద్ద బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు తిరిగి మొదలవుతున్నాయి.

‘ఇండియన్ 2’ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. దానికి కారణం ఏంటనేది తెలియడం లేదు. చిత్ర నిర్మాతల కారణంగానే సినిమా షూటింగ్ మొదలుకావడం లేదని కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. నిర్మాతల తీరుతో విసిగిపోయిన శంకర్.. వారికో లేఖ రాశారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచన ఉందా..? లేదా..? అంటూ ప్రశ్నించారట. త్వరగా షూటింగ్ మొదలుపెట్టకపోతే తాను మరో సినిమా చేసుకుంటానని హెచ్చరించారట. వచ్చే మూడు, నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయకపోతే.. ఆ తరువాత చాలా ఆలస్యమవుతుందని చెప్పారట. కమల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయితే.. ఆ తరువాత సినిమా పరిస్థితి ఏమవుతుందో చెప్పలేమని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus