Bigg Boss 5 Telugu: సడెన్ గా షణ్ముక్ ఎందుకు మారిపోయాడు..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఎవరి గేమ్ ప్లాన్ ని వాళ్లు వేసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత సిరిని ఎవైడ్ చేస్తూ వచ్చాడు షణ్ముక్. నాతో ఎందుకు మాట్లాడట్లేదు ? అసలు నీకు ఏమైంది ? అంటూ సిరి షణ్ముక్ ని నిలదీసింది. ఫన్నీగా ఆటపట్టిస్తూనే తనతో ఉండమని, నీతో మాట్లాడకపోతే నాకు తోచదు అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి షణ్ముక్ ఏదో విషయంలో అలిగాడు అనుకున్నది కానీ, తనని నిజంగానే ఎవైడ్ చేశాడని అనుకోలేదు. నీతో మాట్లాడకుండా ఉండలేను అంటే అలవాటు చేసుకో అంటూ చెప్పాడు షణ్ముక్.

ఫ్రెండ్షిప్ కూడా చేయలనుకోవట్లేదు అనేసరికి సిరి బాధపడింది. ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఏడ్చింది. షణ్ముక్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. మరోవైపు జెస్సీ కెప్టెన్ అయిన తర్వాత రేషన్ మేనేజర్ గా షణ్ముక్ ని ఎంచుకున్నాడు. మన కొత్త రేషన్ మేనేజర్ అంటూ షన్నూని సిరికి పరిచయం చేస్తూ ఫన్ చేశాడు. సిరి మాత్రం చాలా సీరియస్ గా అక్కడ్నుంచీ వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. కానీ, జెస్సీ మాత్రం వాళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేశాడు. ఫలించలేదు.

అసలు షణ్ముక్ సిరిని ఎందుకు ఎవైడ్ చేస్తున్నాడు అనేది ఆసక్తికరం. ఇది తన గేమ్ ప్లాన్ లో భాగంగా చేస్తున్నడా ? లేదా సరయు ఇంకా ఉమాదేవిలు వెళ్లిపోతూ ఇద్దరూ కలిసి గేమ్ ఆడటం కాదు, విడివిడిగా ఆడండి అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అన్నందుకా.. ? ఏ విషయంలోనే స్ట్రాంగ్ డెసీషన్ తీస్కున్నాడు. ఇదే విషయాన్ని జెస్సీకి గేమ్ ఆడేటపుడు కూడా చెప్పాడు. బెడ్ కూడా మార్చేసుకుంటాను అని, ఇక్కడ ఎవరి గేమ్ వారిదే అని అన్నాడు. సిరి సేఫ్ గేమ్ ఆడుతోంది. సిరికి సపోర్ట్ చేస్తుండటం వల్ల ఇండైరెక్ట్ గా రవి అండ్ గ్రూప్ కి కూడా సపోర్ట్ చేయాల్సి వస్తోందని షణ్ముక్ తనగేమ్ ని ఎనలైజ్ చేస్కున్నాడు. అందుకే, సిరిని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యాడు. మరి వీళ్లిద్దరూ నిజంగానే విడివిడిగా గేమ్ ఆడతారా..? లేదా ఒకనొక సందర్భంలో కలిసిపోతారా అనేది చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus