బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అనేది ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా హౌస్ మొత్తాన్ని లాక్డౌన్ చేసిన బిగ్ బాస్ అభయహస్తం అనే టాస్క్ ని క్రియేట్ చేశాడు. ఈ టాస్క్ లో గెలిచిన వాళ్లు మాత్రమే హౌస్ లోకి యాక్సెస్ ని సంపాదిస్తారు అంటూ కండీషన్ పెట్టాడు. ఇద్దరిద్దరుగా వచ్చి ఐదు ఛాలెంజస్ ని ఎదుర్కోవాలని వాళ్లలో గెలిచిన వాళ్లకి మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ లభిస్తుందని చెప్పాడు.
ముందుగా ఈ ఛాలెంజ్ లో పోటీ చేసేవాళ్లని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఎంచుకోవాలని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడే ఆర్గ్యూమెంట్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ కెప్టెన్ సన్నీ దీన్ని చాలా కూల్ గా డీల్ చేశాడు. ఇంతవరకూ కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు అయితే రాలేదో మొదట వారికి అవకాశం కల్పిద్దాం అంటూ షణ్ముక్ ఇంకా లోబోలకి ఈ అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ ఛాలెంజ్ లో భాగంగా లోబో ఇంకా షణ్ముక్ ఇద్దరూ మట్టిలో ముత్యాలు అనే టాస్క్ లో పాల్గొన్నారు.
ఇందులో మట్టి, పేడ కలిసిన డబ్ లో దిగి ముత్తాలని ఏరి , నీటిలో కడిగి నీట్ గా వేరే బౌల్ లో వేయాలి. ఒకసారి డబ్ లో దిగితే ఒక ముత్యాన్ని మాత్రమే తీయాలి. ఈ టాస్క్ లో లోబో 74 లు ముత్యాలని కలక్ట్ చేస్తే , షణ్ముక్ ఏకంగా 101 ముత్యాలని ఏరి విజయం సాధించాడు. ఇక్కడే కాసేపు ఆర్గ్యూమెంట్స్ కూడా అయ్యాయి. ముత్యాలకి మట్టి ఉండకూడదని, నీట్ గా ఉన్నవి మాత్రమే చూడాలని లోబో సపోర్టర్స్ గొడవ చేశారు.
అయినా కూడా సన్నీ క్లారిటీగా డెసీషన్ తీస్కుని షణ్ముక్ ని విన్నర్ గా డిసైడ్ చేశాడు. దీంతో ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ కెప్టెన్సీ కంటెండర్ గా ఎంపిక అయ్యాడు. అయితే, కెప్టెన్ అవుతాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే, కెప్టెన్సీ పోటీదారుల్లో ఇప్పటివరకూ షణ్ముక్ తో పాటుగా, సిరి ఇంకా శ్రీరామ్ చంద్రలు కూడా ఎంపిక అయ్యారు. మరో ఇద్దరు పోటీకి రావాల్సి ఉంది. అదీ విషయం.