బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం లాస్ట్ కెప్టెన్ షణ్ముక్ ఎంపిక అయ్యాడు. హౌస్ మేట్స్ లో మెజారిటీ కుటుంబసభ్యులు షణ్ముక్ కి ఓటు వేసి మరీ గెలిపించారు. అయితే, ఇక్కడే నియంత మాటే శాసనంలో ఐదో రౌండ్ ఆడుతున్నప్పుడు షణ్ముక్ సింహాసనం పై నియంతగా కూర్చున్నాడు. లాస్ట్ గా మిగిలిన రవి ఇంకా పింకీలలో ఒకర్ని కాపాడే ఛాన్స్ షణ్ముక్ కి వచ్చింది. పింకీ తను ఇప్పటివరకూ కెప్టెన్ అవ్వలేదు అని, ఇదే నా లాస్ట్ అండ్ ఫస్ట్ ఛాన్స్ అని రిక్వస్ట్ చేసింది.
అంతేకాదు, నేను నాలాంటి వాళ్లకి ఎంతోమందికి ఇన్స్ పిరేషన్ గా ఉండాలనుకుంటున్నా అని, బయటకి వెళ్లాక బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా ఉన్నాని అందరితో చెప్పుకుంటాను అని ప్రాధేయపడింది. ఇక్కడే కాజల్ తన కమ్యూనిటీలో ప్రౌడ్ గా ఉంటుంది కదా అనే మాట అని కన్సిడర్ చేయమని మాట్లాడింది. దీనికి షణ్ముక్ చాలా సీరియస్ అయ్యాడు. అసలు ఆ మాట నువ్వు తీస్కుని రాకూడదని, అది చాలా తప్పు అని నేను వెధవ అని ముద్రవేయడానికే ఇలా చేస్తున్నావా ఇలా మాట్లాడుతున్నావా అంటూ కాజల్ పై అరిచాడు. అంతేకాదు, చాలా సీరియస్ గా ఈ ఇష్యూని డీల్ చేశాడు షణ్ముక్. అలా పింకీ కూడా మాట్లాడటం కరెక్ట్ కాదని వాదించాడు.
ఆ తర్వాత రవిని సేఫ్ చేస్తున్నాను అని తన డెసీషన్ చెప్పాడు షణ్ముక్. అయితే, ఈ విషయంలో పింకీ చాలా ఎమోషనల్ అయిపోయింది. వాష్ రూమ్ లోకి వచ్చి మరీ ఏడ్చింది. మానస్, సన్నీ, కాజల్ ముగ్గురూ పింకీకి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడే మానస్ కావాలనే నిన్ను షణ్ముక్ ఆటలోనుంచీ తప్పించాడు అని, రవి ఉంటే తను ఈజీగా కెప్టెన్ అవ్వచ్చని లెక్కలు వేసి మరీ రవిని సేఫ్ చేశాడని చెప్పాడు. రవికి హౌస్ లో ఎవరి సపోర్ట్ ఉండదని మహా అయితే రెండు ఓట్లు వస్తాయని మిగతావి తనకే వస్తాయి కాబట్టి తను ఈజీగా కెప్టెన్ అవ్వచ్చనే మాస్టర్ మైండ్ తో ఆడాడని మానస్ అన్నాడు.
ఇదే విషయాన్ని కాజల్ డైరెక్ట్ గా షణ్ముక్ ని అడిగేసింది. హౌస్ మేట్స్ ఓటింగ్ జరిగేటపుడు నువ్వు కావాలనే ఇలా చేశావా అంటూ కాజల్ షణ్ముక్ ని అడిగింది. అయితే, ఇలా నేను లెక్కలు వేసి గేమ్ ఆడలేదని స్ట్రయిట్ గా ఆన్సర్ చెప్పాడు షణ్ముక్. కెప్టెన్ రేసులో రవి కి కేవలం శ్రీరామ్ మాత్రమే ఓటు వస్తే, మిగిలిన ఇంటి సభ్యులు అందరూ షణ్ముక్ కి ఓటు వేశారు. దీంతో షణ్ముక్ ఇంటి చివరి కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. అదీ మేటర్.